Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

vastu tips: అప్పు తీసుకుంటున్నారా? అయితే ఈ రోజుల్లో అస్సలు తీసుకోకండి!!

చాలామంది అవసరాలకు అప్పులు చేస్తూ ఉంటారు. ఇక అప్పులు తీర్చడానికి నానా ప్రయత్నాలు కూడా చేస్తారు. అయితే అప్పు తీసుకునే విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏరోజు పడితే ఆరోజు అప్పు తీసుకుంటే అప్పు తీర్చలేని పరిస్థితి వస్తుందని, అందుకే అప్పు తీసుకునే రోజు విషయంలో జాగ్రత్త వహించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అప్పు తీసుకోవాలంటే సరైన రోజు చూసుకోవాలి

అప్పు తీసుకోవాలంటే సరైన రోజు చూసుకోవాలి


ప్రస్తుత సమాజంలో విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో, పెరిగిపోతున్న ఖర్చుల దెబ్బకు ఎంత సంపాదించినా మళ్ళీ అప్పు అవసరం అవుతుంది. అప్పు తీసుకోని వారు దాదాపుగా లేరనే చెప్పాలి. అయితే అప్పు తీసుకున్న వారు తిరిగి అప్పు చెల్లించే విషయంలో నానా పాట్లు పడాల్సి వస్తుంది. అందుకు సహకరించని వారి ఆర్ధిక పరిస్థితి ఒక కారణమైతే, ఇంకొక కారణం అప్పు తీసుకునే రోజు, సమయం అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఎవరి నుంచైనా అప్పు తీసుకుని తిరిగి కట్టాలంటే అందుకు తగిన అనుకూలతలు ఉండాలని చెబుతున్నారు. అప్పు తీసుకున్న వ్యక్తులకు సంబంధించిన గ్రహాలు, రాశులు అనుకూలించాలి అని అంటున్నారు.

ఈ మూడు రోజులు అప్పు తీసుకోకండి..

ఈ మూడు రోజులు అప్పు తీసుకోకండి..

అయితే ముఖ్యంగా కొన్ని రోజుల్లో అప్పు తీసుకుంటే అప్పు తీర్చడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. కొన్ని రాశుల వారు మంగళవారంనాడు, బుధవారం నాడు, శనివారం నాడు అప్పు తీసుకుంటే తిరిగి తీర్చడం కష్టమవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా హస్త, మూల, ఆరుద్ర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, ఉత్తర పాల్గుణి, రోహిణి, వైశాఖ, కృత్తికా నక్షత్రాల వారు ఈ మూడు రోజులు ఎవరి వద్ద నుండి అప్పు తీసుకో కూడదని, ఒకవేళ తీసుకుంటే దానిని తీర్చడం కష్టంగా మారుతుందని, రక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అప్పు తీసుకునే రోజులు .. తిరిగి చెల్లించే రోజులు ఇలా

అప్పు తీసుకునే రోజులు .. తిరిగి చెల్లించే రోజులు ఇలా

అంతేకాదు ఈ నక్షత్రాల వారు పొరపాటున కూడా ఆదివారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదని సూచిస్తున్నారు. సోమ, గురు, శుక్రవారాలలో వీరు తీసుకున్నట్లయితే తిరిగి కట్టగలిగే శక్తి వీరికి వస్తుందని, ఆ అప్పును సునాయాసంగా తీర్చగలుగుతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక తీసుకున్న అప్పు చెల్లించటానికి కూడా సరైన రోజులు ఉంటాయని ఆ రోజుల్లో అయితే కచ్చితంగా అప్పు తీర్చగలుగుతారని సూచిస్తున్నారు. మంగళ, బుధవారాలను అప్పు తీర్చడానికి సరైన రోజు గా వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

అప్పు విషయంలో జాగ్రత్త.. లేదంటే చుక్కలే

అప్పు విషయంలో జాగ్రత్త.. లేదంటే చుక్కలే

ఏది ఏమైనా అప్పు తీసుకునే విషయంలో, తీర్చే విషయంలో కూడా ఏ రోజు మనం తీసుకుంటున్నాము, ఏ రోజు తిరిగి ఇస్తున్నాము అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నక్షత్రాలు, రాశుల వారీగా వారి జాతకానుసారం అప్పుల విషయంలో అప్రమత్తత అవసరం. లేదంటే తీసుకున్న అప్పు చెల్లించటానికి చుక్కలు చూడాల్సి వస్తుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+