vastu tips: ఈ నాలుగు పనులు చెయ్యటం మానుకోండి.. డబ్బు సమస్యలు తీరతాయి చూడండి!!

ప్రతి వ్యక్తి తన జీవితంలో సంపదను, విలాసాన్ని కోరుకుంటాడు. కానీ కొన్నిసార్లు మీరు చాలా కష్టపడి పనిచేసినప్పటికీ విజయం సాధించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తు దోషం వల్ల ఎక్కడో ఒకచోట అడ్డంకులు ఏర్పడి విజయం సాధించలేక పోతున్నారు అనేది వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం. వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనుకుంటే, దీని కోసం లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడం అవసరం. దీని కోసం మీరు మీ అలవాట్లలో కొన్నింటిని మార్చుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మంచం మీద కూర్చుని ఈ పని చేయకండి

మంచం మీద కూర్చుని ఈ పని చేయకండి


ఇళ్లల్లో ముఖ్యంగా మార్చుకోవలసిన అలవాట్ల విషయానికి వస్తే ఎప్పుడూ ఎటువంటి పరిస్థితులలోనూ మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చుని భోజనం చేస్తే అప్పులు పెరుగుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. సాధారణంగా వృద్ధులు మంచం మీద ఆహారం తినడాన్ని తప్పుగా చెబుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఈ విధంగా మంచం మీద భోజనం చేయడం దోషంగా పరిగణించబడుతుంది. కాబట్టి మంచం మీద భోజనం చేయడాన్ని కచ్చితంగా నిషేధించాల్సిందే.

వంట గదిలో పాత్రలను అలా ఉంచండి

వంట గదిలో పాత్రలను అలా ఉంచండి

వాస్తు శాస్త్రం ప్రకారం, రాత్రిపూట వంటగదిలో ఎప్పుడూ ఎంగిలి పాత్రలు ఉంచకూడదు. దీని వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లోకి ప్రవేశించదు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే రాత్రి పడుకునే ముందు వంటగదిలో ఉంచిన ఎంగిలి పాత్రలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఇదే సమయంలో వంట గదిలో పాడై పోయిన, చిల్లులు పడిన పాత్రలను ఉంచుకోకూడదు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వంటగది ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి అంత ఇష్టం ఉంటుందని చెప్తారు.

బాత్రూంలో బకెట్లు ఇలాగే ఉంచాలి

బాత్రూంలో బకెట్లు ఇలాగే ఉంచాలి

ఇక వాస్తు శాస్త్రం ప్రకారం మనం తెలుసుకోవాల్సిన మరొక నియమం బాత్రూంలో ఖాళీ బకెట్లు ఉంచకూడదు. బాత్రూంలో ఖాళీ బకెట్లు ఉంచితే వాస్తు దోష మనీ వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ బకెట్ ఖాళీగా ఉంటే, బకెట్ ను బోర్లించాలి అని సూచిస్తున్నారు. అలా కాకుండా ఖాళీ బకెట్లు బాత్రూంలో ఉంచితే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ అలవాటును కూడా మార్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు

సూర్యాస్తమయం తర్వాత ఈ పని చేయకండి

సూర్యాస్తమయం తర్వాత ఈ పని చేయకండి

వాస్తు శాస్త్రం ప్రకారం మార్చుకోవలసిన మరొక అలవాటు సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను బదులుగా గాని, దానంగా గానీ ఇవ్వకుండా ఉండాలి. అనుకోకుండా ఎవరికీ పెరుగు, ఊరగాయ, ఉప్పు లేదా పాలు ఇవ్వకూడదు వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంటి ఐశ్వర్యం హరించుకుపోతుంది అని, ఎంత సంపాదించినా నిలబడదని సూచిస్తున్నారు. ఈ అలవాట్లు మార్చుకుంటే కచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని, లేదంటే పేదరికం పట్టి పీడిస్తుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ నాలుగు అలవాట్లను మార్చుకుని, డబ్బు సమస్యల నుండి బయటపడండి.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+