వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: స్థలం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త.. వాస్తులేని ఇలాంటి స్థలాలు అస్సలు కొనకండి!!

|
Google Oneindia TeluguNews

సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం ముందు స్థలాన్ని కొనుగోలు చేయాలి. అయితే స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలు చేస్తున్న ప్రాంతం, ధర మాత్రమే కాకుండా ఆ స్థలానికి వాస్తు ఉందా? ఆ స్థలంలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? ఎటువంటి స్థలాలను కొనుగోలు చేయవచ్చు? వేటిని కొనుగోలు చేయకూడదు? ఎటువంటి స్థలాలు నివాసయోగ్యం వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని స్థలాన్ని కొనుగోలు చేసుకోవాలి.

ఎటువంటి స్థలాలను కొనుగోలు చెయ్యాలి అంటే

ఎటువంటి స్థలాలను కొనుగోలు చెయ్యాలి అంటే


నివాసయోగ్యం కాని స్థలాలను కొనుగోలు చేస్తే దాని ప్రభావం ఆ స్థలంలో ఇల్లు కట్టుకుని జీవిస్తున్న కుటుంబంపై తప్పనిసరిగా ఉంటుంది. వారు ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బందులతో ఉంటారు. కాబట్టి నివాసయోగ్యమైన స్థలాలను జాగ్రత్తగా చూసుకొని కొనుగోలు చేసుకుంటే అక్కడ ఇల్లు కట్టుకొని నివసించినా, ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇంతకీ స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి స్థలాలు యోగ్యమైనవి అనేది తెలుసుకోవాలి. వాస్తుకు వ్యతిరేకంగా లేని స్థలాన్ని మాత్రమే ఎంచుకుని కొనుగోలు చేయాలి.

కొనుగోలు చేసే స్థలం ఇలా ఉంటే మంచిది

కొనుగోలు చేసే స్థలం ఇలా ఉంటే మంచిది


కొనుగోలు చేసే స్థలం బల్లపరుపుగా, చదునుగా ఉండాలి. స్థలానికి పడమర దిశలో కాని, దక్షిణ దిశలో గాని పెద్దపెద్ద గోతులు, కాలువలు ఉండకూడదు. పడమర దక్షిణ దిశలలో స్థలం ఎత్తుగా ఉండొచ్చు. పడమర , దక్షిణ దిశలో ఎత్తైన కొండలు, గుట్టలు ఏవి ఉన్నా అటువంటి స్థలాలను కొనుగోలు చేయవచ్చు. ఉత్తరం వైపు, తూర్పు వైపు స్థలం పల్లంగా ఉండాలి. కొనుగోలు చేసే స్థలానికి ఉత్తర భాగాన కానీ, తూర్పున కానీ బావులు, గోతులు, జలాశయాలు ఉండవచ్చు. కొనుగోలు చేసే స్థలంలో ఈశాన్య దిక్కు పల్లంగా ఉంటే అది ఎంతో ఉత్తమం. ఈశాన్య దిక్కు కన్నా మిగతా మూలలు పల్లంగా ఉండకూడదు అనేది వాస్తు నియమం.

స్థలంలో ఎముకలు, దంతాలు.. పుట్టలు ఉంటే చెయ్యాల్సింది ఇదే

స్థలంలో ఎముకలు, దంతాలు.. పుట్టలు ఉంటే చెయ్యాల్సింది ఇదే


స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు స్థలానికి అతి చేరువలో స్మశానాలు, కర్మాగారాలు, అధిక ధ్వనిని కలిగించే రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లు, విమానాశ్రయాలు వంటివి లేకుండా జాగ్రత్త పడాలి. మనం నివసించే స్థలానికి దగ్గర ఇవి ఉంటే ధ్వని కాలుష్యం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఇక అంతే కాదు స్థలానికి అతి దగ్గరలో మురుగు కాలువలు లేకుండా చూసుకోవాలి. మీరు నిలిచిపోయే గోతులు లేకుండా చూసుకోవాలి. ఇక స్థలం కొనుగోలు చేసేటప్పుడు స్థలంలో పాముల పుట్టలు కనిపించినా, మట్టి దిబ్బలు కనిపించిన, ఎముకలు, దంతాలు వంటివి కనిపించినా ఆ స్థలం నివాసయోగ్యం కాదని వదిలివేయాలి. పొరపాటున కూడా ఇటువంటి స్థలాలను కొనుగోలు చేసి వాటిలో నిర్మాణం చేయకూడదు.

స్థలానికి కొన్ని వీధిపోట్లు, వీధి శూల లేకుండా చూసుకోవాలి

స్థలానికి కొన్ని వీధిపోట్లు, వీధి శూల లేకుండా చూసుకోవాలి


ఒకవేళ అలా చేస్తే దాని ఫలితం ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులు అందరిపైనా ఉంటుంది. అంతేకాదు ఉత్తరం దక్షిణం కన్నా మెరకగా ఉండకూడదు. తూర్పు పడమర కన్నా మెరకగా ఉండకూడదు. స్థలానికి ఎదురుగా వీధిపోటు కానీ వీధిశూల కానీ ఉండకూడదు. కొన్ని రకాల వీధిపోట్లు అసలే ఉండకూడదు. స్థలం రోడ్డు కంటే దిగువకు ఉండకూడదు. స్థలం పై ఆలయ నీడ పడకూడదు. కాబట్టి స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని స్థలాలను పరిశీలించుకోవాలి. నివాసయోగ్యమైనవని భావిస్తేనే కొనుగోలు చేసుకోవాలి.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Vastu tips: ఇంటికి దక్షిణ ఆగ్నేయం వీధిపోటు.. ఆ ఇంట్లో వాళ్ళ పంట పండినట్టే!!Vastu tips: ఇంటికి దక్షిణ ఆగ్నేయం వీధిపోటు.. ఆ ఇంట్లో వాళ్ళ పంట పండినట్టే!!

English summary
Care should be taken while buying land. It is better to buy plots following Vastu rules. It is said that the places with street focus, south and west sloping places should not be bought at all.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X