వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రోజుల్లో చీపురు కొంటే దురదృష్టాన్ని తెచ్చుకున్నట్టే .. చీపురును అలా పెడితే దరిద్రాన్ని ఆహ్వానించినట్టే!!

|
Google Oneindia TeluguNews

ఇంటి నిర్మాణానికి, ఇంట్లో పెట్టుకునే వస్తువులకు ఏ విధంగా అయితే వాస్తు ఉంటుందో అదేవిధంగా ఇంట్లో చీపురు ఉపయోగించడానికి, చీపురును కొనుగోలు చేయడానికి, చీపురు ఏ మూలన పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అనే అంశాల పైన వాస్తు శాస్త్ర నియమాలు ఉన్నాయి. ఉత్తమమైన గృహిణులు ఉదయం లేవగానే మొదట చేసే పని చీపురుతో ఇల్లంతా శుభ్రం చేయడం. మహాలక్ష్మీ స్వరూపంగా భావించి చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి అందాన్ని పెంచే గృహిణులు చీపురు విషయంలో తెలుసుకోవలసిన అనేక ముఖ్యమైన అంశాలు మీకోసం..

చీపురు పెట్టాల్సిన స్థానాలు ఇవే
ఇంట్లో మనం ఉపయోగించే చీపురు ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈశాన్యం, ఆగ్నేయం మూలలో కాకుండా, నైరుతి, వాయువ్య మూలలలో చీపురును కనిపించకుండా పెట్టాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చీపురుతో ఇంటిని శుభ్రం చేసే సమయంలో శివాయ నమః అంటూ భగవంతుని స్మరించుకొని శుభ్రం చేస్తే శనీశ్వరుడు ఇంట్లో నుంచి వెళ్లిపోతాడని చెబుతారు. ఇక అటువంటి చీపురు ను కొనుగోలు చేసే సమయాన్ని కూడా నిర్దేశించారు.

కొత్త చీపురు ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదు .. తెలుసుకోవాల్సిన అంశాలివే
ఇంట్లో పాత చీపురు పాడైపోయి కొత్త చీపురు కొనాలంటే వాస్తు శాస్త్రంలో తగిన సూచన ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో పాత చీపురు స్థానంలో కొత్తది కొనడానికి శనివారం ఎంపిక చేసుకోవాలి. శనివారం నాడు కొత్త చీపురు ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది కాకుండా, కృష్ణ పక్షంలో చీపురు కొనడం ఎల్లప్పుడూ మంచిది. అయితే శుక్ల పక్షంలో కొనుగోలు చేసిన చీపురు దురదృష్టానికి సూచిక. కాబట్టి, ఈ సమయంలో చీపురు కొనకూడదు. మంగళవారం శుక్రవారం మహాలయపక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురును కొనుగోలు చేయడం శుభప్రదం కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Vastu tips: buying a broom on those days brings bad luck; keeping broom in wrong position invites poverty

పాడైపోయిన చీపుర్లు పడెయ్యవలసిన రోజులు ఇవే
అంతేకాదు పండుగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు, రోహిణి నక్షత్రం, హస్త నక్షత్రం, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనూరాధ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో చీపురు కొనకూడదని చెబుతున్నారు. ఇక ఇంట్లో పాడైపోయిన చీపురును సోమవారం, బుధవారం,గురువారం, ఆదివారం మాత్రమే బయట పడేయాలి. మంగళవారం, శుక్రవారం, శనివారాలలో చీపురును పడేయడం మంచిది కాదు.

చీపురు అలా పెడితే దరిద్రాన్ని ఆహ్వానించినట్టే
అంతేకాదు ఇంట్లో చీపురు పెట్టడానికి కూడా ఒక విధానం ఉంటుంది. చాలామంది మహిళలు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురును పాడైపోకుండా, ఊడ్వటానికి పట్టుకున్న భాగాన్ని క్రింది సైడ్ నుంచి, శుభ్రం చేసే కుచ్చు భాగాన్ని పైకి పెట్టి చీపురును నిలబెడుతూ ఉంటారు. ఇలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ఆహ్వానించినట్టు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. కుచ్చు భాగం కిందికి ఆనించి పెడితే చీపురు పాడైపోతుందని భావించే మహిళలు చీపురును అలా ఉంచడం దరిద్రాన్ని ఆహ్వానించడం అని గుర్తించాలి. చీపురును నిల్చోబెట్టకుండా, పడుకోబెడితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

చీపురు చాట ఒకే చోట పెడితే అరిష్టం
అంతే కాదు చీపురును, చెత్త ఎత్తే చాటను ఒకే చోట ఉంచటం అరిష్టమని చెబుతున్నారు. ఇక బెడ్ రూమ్ లో చీపురును ఎప్పుడూ ఉంచకూడదని చెబుతున్నారు. బెడ్ కింద చీపురు పెట్టే అలవాటు ఉంటే మానుకోవాలని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అంతే కాదు ఎవరైనా మరణించిన తర్వాత, ఆ మృతదేహాన్ని తీసివేసిన తరువాత అక్కడ శుభ్రం చేయడానికి వినియోగించిన చీపురును, మళ్లీ వినియోగించకూడదు అని, ఆ చీపురును పారేయాలని సూచిస్తున్నారు. ఇంట్లో పసిబిడ్డలు పుట్టినప్పుడు కూడా పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటివరకు ఉపయోగించిన చీపురును మళ్లీ ఉపయోగించకూడదని సూచిస్తున్నారు.

English summary
Vastu Shastra says that buying a broom in a Waxing Moon period brings bad luck. It is said that keeping a broom in wrong direction invites the poor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X