వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ఇంట్లో కామధేను విగ్రహం ఆ దిశలో పెడితే ఐశ్వర్యంతో పాటు బోలెడు బెనిఫిట్స్

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రంలో ఇంట్లో పెట్టుకునే వస్తువులకు కూడా వాస్తు ఉంటుందన్న విషయాన్ని చెప్పారు. ఇంట్లో వాస్తు అనుకూలమైన వస్తువులు పెట్టుకుంటే సానుకూల శక్తి ఇంట్లో ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో లేదా కార్యాలయంలో కోరికలు తీర్చే విశ్వ గోవు అయిన కామధేను విగ్రహాన్ని పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు. హిందూమతంలో గోమాతను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. గోమాతలో సకల దేవతలు నివసిస్తారు అని నమ్ముతారు. గోమాతను పూజిస్తే సకల దోషాలు పరిహారం అవుతాయని విశ్వసిస్తారు. ఇక అటువంటి గోమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సుఖ శాంతులు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వాస్తులో కామధేను ప్రాముఖ్యత

వాస్తులో కామధేను ప్రాముఖ్యత

భారతీయ పురాణాల ప్రకారం, కామధేను క్షీరసాగర మధన సమయంలో ఉద్భవించింది. కాబట్టి ఇళ్లల్లో కామధేను విగ్రహాన్ని ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెబుతున్నారు. గోమాతను పూజించే ఆవు తన బిడ్డ అయిన లేగ దూడకు పాలు ఇస్తున్నట్టు ఉండే విగ్రహం ఇంట్లో ఉండటం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇది కుటుంబ సభ్యుల కోరికలు తీరడమే కాకుండా, అనారోగ్యాల నుండి అశుభాల నుండి కుటుంబ సభ్యులకు విముక్తి కలిగిస్తుందని చెబుతున్నారు. మానసిక, శారీరక, భావోద్వేగ సంబంధమైన అనేక అనారోగ్యాలను కామధేను విగ్రహం తగ్గిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులను కూడా తొలగిస్తుందని సూచిస్తున్నారు.

కామధేను విగ్రహాన్ని ఇంట్లో ఉంచడానికి వాస్తు సూచనలు

కామధేను విగ్రహాన్ని ఇంట్లో ఉంచడానికి వాస్తు సూచనలు

వాస్తు నియమాల ప్రకారం, కామధేను ఆవు మరియు దూడ విగ్రహాన్ని ఉంచడానికి మీ ఇంటికి ఈశాన్య దిశను అనువైన ప్రదేశంగా చెబుతున్నారు. సహజంగా ఈశాన్య దిశలో ఎటువంటి బరువైన వస్తువులు పెట్టకూడదు, కానీ ఈశాన్యం హిందూ విశ్వాసాల ప్రకారం దేవతల కోసం ప్రత్యేకించబడిన పవిత్ర స్థలం కాబట్టి, ఈశాన్య దిశలో అందరూ దేవతలను మోసే కామధేను ఆవు విగ్రహాన్ని ఉంచడం మంచిని చేకూరుస్తుందని చెబుతున్నారు.

పూజగదిలోనూ, ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కామధేను విగ్రహాలు మంచిది

పూజగదిలోనూ, ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కామధేను విగ్రహాలు మంచిది

ఇది సాధ్యం కాకపోతే, మీరు కామధేను ఆవు విగ్రహాన్ని మీ ఇంటికి ఉత్తరం లేదా తూర్పు భాగంలో ఉంచవచ్చు. మీ కార్యాలయంలో కామధేను ఆవు విగ్రహాలను ఉంచేటప్పుడు కూడా ఇవే వాస్తు నియమాలు వర్తిస్తాయి. అంతేకాదు పూజ గదిలో కూడా కామధేను విగ్రహాన్ని ఉంచడం మంచిదని చెబుతున్నారు. ఇక ఇంటి ప్రవేశద్వారం వద్ద కామధేనువు విగ్రహాన్ని ఉంచితే మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఇది ఇంట్లోకి ఆనందాన్ని, శ్రేయస్సును తీసుకువస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వెండి, ఇత్తడి, రాగి , పాలరాయి, సిరామిక్ విగ్రహం ఏదైనా ఫలితం మాత్రం అద్భుతం

వెండి, ఇత్తడి, రాగి , పాలరాయి, సిరామిక్ విగ్రహం ఏదైనా ఫలితం మాత్రం అద్భుతం

ఆవులు ఇంటికి సంపదను తీసుకు వస్తాయి కాబట్టి, చాలా గ్రామాలలో పశువుల కొట్టాలు ఇళ్లకు ముందే ఉండడం ప్రధానంగా కనిపిస్తుంది. ఆర్థిక స్థోమత ఉన్నవారు, వెండితో చేసిన కామధేను ఆవు విగ్రహాన్ని ఇంటిలో పెట్టుకుంటే ముఖ్యంగా దానిని మీ పూజా గదులలో ఉంచడం మంచిది. అంతేకాదు ఇత్తడి లేదా రాగి వంటి లోహాలతో కూడా మీ ఆవు మరియు దూడ విగ్రహాన్ని తయారు చేయించుకుని ఇళ్లల్లో పెట్టుకోవచ్చు . ఇక పాలరాతి కామదేను విగ్రహాలు కూడా ఇళ్లల్లో అంతే శుభ ఫలితాలను ఇస్తాయి. ఇక సిరామిక్‌తో తయారు చేసిన ఆవు మరియు దూడ విగ్రహాలు కూడా లభిస్తున్న పరిస్థితి ఉంది.

 కామధేను విగ్రహాలతో అనేక ప్రయోజనాలు

కామధేను విగ్రహాలతో అనేక ప్రయోజనాలు

కామధేను ఆవు మరియు దూడ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కామధేను విగ్రహం ఇంట్లో సానుకూల ప్రభావాన్ని తీసుకువస్తుంది. ఆరోగ్యం, సంపద, శాంతి, శ్రేయస్సు , విజయం, సానుకూలత ఈ విగ్రహాలు పెట్టుకున్న ఇళ్లల్లో ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

English summary
Cow and calf Kamadhenu idol keep in northeast direction in the house brings many benefits along with wealth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X