vastu tips: ఈ వస్తువులు ఇంటి ప్రధానద్వారం వద్ద అస్సలు ఉండనివ్వకండి, అప్పులు పెరుగుతాయి!!

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు లేదా ఇంటి పరిసరాలు, మనం ఇంట్లో పెట్టే వస్తువులు, వాటి స్థానం సామాజిక, ఆర్థిక మరియు కుటుంబ జీవితంపై చాలా లోతైన ప్రభావాన్ని చూపుతాయి. మీ భవిష్యత్తు జీవితం ఎలా ఉంటుందో అది నిర్ణయిస్తుంది. ముఖ్యంగా ప్రధాన ద్వారం ముందు కొన్ని వస్తువులను ఉంచడం చెడుగా పరిగణించబడుతుంది . ఇది వాస్తు దోషాన్ని కూడా పెంచుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇంట్లో నివసించే సభ్యులపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రధాన ద్వారం ముందు ఉంచే వస్తువుల వల్ల రుణ సమస్యలు పెరుగుతాయి అని చెబుతున్నారు. ఇక ఈ క్రమంలో ప్రధాన ద్వారం ముందు ఏ వస్తువులు ఉండకూడదో తెలుసుకుందాం.

 ఇంటి ముందు పెద్ద గొయ్యి ఉందా? అయితే జాగ్రత్త

ఇంటి ముందు పెద్ద గొయ్యి ఉందా? అయితే జాగ్రత్త


వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి బయట చెత్త వేయకూడదు. ప్రధాన ద్వారం వెలుపల చెత్త కారణంగా, ఇది ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. డబ్బు సంబంధిత సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఇంటి ముందు చెత్త లేదా గొయ్యి ఉండటం వాస్తు ప్రకారం దుఃఖ కారకంగా పరిగణించబడుతుంది. కాబట్టి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఇలాంటి పరిస్థితులు లేకుండా చూసుకోండి. చెత్తా చెదారం లేకుండా నీట్ గా ఉంచుకునేలా చూడండి.

ప్రధాన ద్వారానికి ఇరువైపులా చెట్లు ఉన్నాయా? అయితే జరిగేది ఇదే

ప్రధాన ద్వారానికి ఇరువైపులా చెట్లు ఉన్నాయా? అయితే జరిగేది ఇదే

ప్రధాన ద్వారం దగ్గర చెట్లు, మొక్కలు ఉండకూడదు. వాస్తు ప్రకారం, ఇది మీ పురోగతిని అడ్డుకుంటుంది. ఇంట్లోని పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు, మీ ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా చెట్లు ఉండకూడదని గుర్తుంచుకోండి. వాస్తు ప్రకారం, ఇంటి ముందు చెట్టు ఉండటం వల్ల వాస్తు దోషం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఇది పిల్లల ప్రగతిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు

 ప్రధాన ద్వారానికి నేరుగా రహదారి ఉందా? అయితే డేంజర్

ప్రధాన ద్వారానికి నేరుగా రహదారి ఉందా? అయితే డేంజర్

ప్రధాన ద్వారం ముందు నేరుగా రహదారి ఉండకూడదని గుర్తుంచుకోవాలి. ఇంటి ముందు ప్రధాన ద్వారానికి ఎదురుగా రోడ్డు ఉంటే అది కుటుంబ సభ్యుల మధ్య సమస్యలకు కారణంగా మారుతుందని చెబుతున్నారు. ఇలా ఇంటికి ఎదురుగా రోడ్డు ఉంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుందని, ఇంట్లో ప్రేమపూర్వక వాతావరణం ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ నీరు లేదా బురద ఉండకుండా చూసుకోవాలి అని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషం నశిస్తుందని సూచిస్తున్నారు.

 ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు ఉన్నాయా? అయితే గొడవలే

ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు ఉన్నాయా? అయితే గొడవలే

వాస్తు ప్రకారం, ఈ వస్తువులను ఇంటి వెలుపల ఉంచడం వల్ల ఇంట్లోని సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని, చాలా డబ్బు నష్టం కూడా కలుగుతుందని అంటున్నారు. ఇక ఇదే సమయంలో ఇంటికి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ స్తంభాలు, స్తంభాలు ఉండకూడదు. దీని ప్రతికూల ప్రభావం ఇంట్లోని స్త్రీలపై పడుతుంది. వృత్తిపరమైన లేదా కుటుంబపరమైన గొడవలతో సమస్యగా ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల, ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు, ఈ విషయాలను గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

 ఇంటి ముందు గుడి ఉందా? అయితే ప్రతికూల ప్రభావమే

ఇంటి ముందు గుడి ఉందా? అయితే ప్రతికూల ప్రభావమే

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ముందు గుడి ఉండకూడదని కూడా గుర్తుంచుకోండి. ఇంటి ముందు గుడి లేదా ధార్మిక స్థలం ఉండటం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఇంటి ముందు గుడి కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అని హెచ్చరిస్తున్నారు. అలాగే, తలుపు పైన తలుపు ఉండకూడదని గుర్తుంచుకోండి, ఇల్లు అందంగా కనిపించడానికి చాలా మంది ఇలా చేస్తారు, కానీ ఇది సరైనది కాదని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+