vastu tips: దీపావళికి వాస్తు ప్రకారం ఈ పనులు చెయ్యండి.. మీకు అన్నీ శుభాలే!!
దీపావళి భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ. దీపావళి పండుగ సందర్భంగా ఇంటిని దీప కాంతులతో నింపి, కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు. ఇక దీపావళి పండుగ వస్తుందంటే ఇంటిని శుభ్రం చేసుకోవడం, ఇంటికి కొత్తగా డెకరేట్ చేయడం ప్రారంభిస్తారు. అయితే దీపావళి పండుగ సందర్భంగా ఇంటిని శుభ్రం చేసుకునే విషయంలో, డెకరేట్ చేసుకునే విషయంలో సులభమైన వాస్తు చిట్కాలు పాటిస్తే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దీపావళి చేసుకోవటానికి మొదటి నియమం ఇదే
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇల్లు ప్రశాంతంగా, సంతోషంగా, సానుకూల ప్రభావం తో ఉండాలంటే పాటించవలసిన మొదటి నియమం శుభ్రత. దీపావళికి ముందు ప్రతికూల శక్తి తొలగించడానికి ప్రతి ఒక్కరూ ఇళ్లలోని ప్రతి చిన్న మూలను శుభ్రపరచడం చాలా అవసరం అని చెబుతున్నారు. దీపావళికి ఇది అత్యంత ప్రాథమిక వాస్తు చిట్కాలలో ఒకటి. ఇంట్లో ఎక్కడ బూజు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. దీపావళికి ఇంటిని శుభ్రం చేసే సమయంలో వంటగది పైన, స్టోర్ రూమ్ పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి.

ఇంట్లో ఈ వస్తువులను ఉంచకండి
ఇంట్లో ఎక్కువ వస్తువులు ఎక్కడపడితే అక్కడ ఉంటే అది మంచిని చేకూర్చదని చెబుతున్నారు. అందుకే గత ఆరు నెలలుగా మీరు ఉపయోగించని వస్తువులు, ఎలక్ట్రానిక్స్, విరిగిన వస్తువులను ఇంట్లో నుంచి తొలగించాలని సూచిస్తున్నారు. పగిలిన అద్దాలను కూడా ఇంట్లో నుండి తొలగించాలని చెబుతున్నారు. దీపావళికి సంబంధించిన ముఖ్యమైన చిట్కాలలో ఒకటి, మీ ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవహించే ప్రధాన ద్వారం మార్గం కాబట్టి మీ ప్రవేశ మార్గం స్పష్టంగా ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారం మీద లక్ష్మీ దేవి యొక్క పాదముద్రలను ఉంచుతామని మనందరికీ తెలిసినప్పటికీ, ఆమెను శుభ్రమైన పరిసరాల తోటి ఇంట్లోకి ఆహ్వానించాలి. అందుకే ఎప్పుడూ ప్రధానద్వారం శుభ్రంగా, చూడగానే ఆకర్షించేలా, కాంతివంతంగా ఉండేలా చూసుకోవాలి.

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం ఈ పని చెయ్యండి
మీ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు, ఇంట్లోని ఉత్తర మరియు ఈశాన్య దిశలు ఎలాంటి చిరాకు లేకుండా చూసుకోవాలి. ఉత్తర దిశ సంపదను నిర్ధారిస్తుంది కాబట్టి ఉత్తరదిశను శుభ్రంగా ఉంచుకోవాలి. దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు ఉత్తరదేశ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. పచ్చదనం ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీని స్వాగతిస్తుంది కాబట్టి తూర్పు మరియు ఉత్తర దిశల మధ్య తేలికపాటి మరియు చిన్న మొక్కలను పెడితే బాగుంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంతేకాదు ఆర్థిక లాభాలను నిర్ధారించడానికి ఇంటిలోని లివింగ్ రూమ్ ను శుభ్రంగా మరియు చిందరవందరగా లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి.

లైట్ల అలంకరణ విషయంలో ఈ నియమాలు పాటించండి
మీరు దీపావళికి మీ ఇంటిని దీప కాంతులతో నింపడానికి సిద్ధం చేస్తుంటే, వాస్తు శాస్త్రం ప్రకారం దిశలను పరిశీలించడం అసలు మరిచిపోవద్దని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అలంకరణ లైట్ల విషయానికి వస్తే మార్కెట్లో అనేక ఎంపికలు ఉన్నాయని, కాస్త వాస్తు దృష్టి తోటి వీటిని ఎంపిక చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. మీరు రంగురంగుల ఫెయిరీ లైట్లు, బల్బులు, డిజైనర్ ల్యాంప్స్ మొదలైనవాటిని ఇంటి అలంకరణ కోసం ఎంచుకోవచ్చు. దీపావళి వాస్తు ప్రకారం వివిధ రంగుల లైట్లకు కొన్ని దిశలు అనుకూలంగా ఉంటాయని సూచిస్తున్నారు.

ఏ దిశలో ఏ రంగుల లైట్లు పెడితే శుభమో తెలుసా!
ఇంటిని అలంకరించేటప్పుడు నీలం, పసుపు మరియు ఆకుపచ్చ దీపాలను ఉత్తర దిశలో పెడితే ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక దక్షిణ దిశ వైపు లైట్ లు పెట్టడానికి తెలుపు, వైలెట్ మరియు ఎరుపు లైట్ లు మంచిదని చెబుతున్నారు. తూర్పు దిశలో ఎరుపు, పసుపు, మరియు నారింజ వంటి రంగుల లైట్లు శుభసూచకంగా ఉంటాయని చెబుతున్నారు. ఇక పశ్చిమ దిశలో పసుపు, నారింజ, మరియు గులాబిరంగు లైట్లతో ఇంటికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా దీపావళి పండుగ సందర్భంగా ఇంటిని శుభ్రం చేయడంలో, దీప కాంతులతో ఇంటిని కాంతివంతంగా మార్చడంలో చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications