వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: బుద్ధుడి విగ్రహాలను ఇళ్ళలో పెట్టుకుంటున్నారా? అయితే చెయ్యకూడనివి ఇవే!!

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఉంచుకునే గృహాలంకరణ వస్తువులకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటివరకు ఇళ్లలో ఏనుగుల విగ్రహాలు, పరిగెడుతున్న గుర్రం విగ్రహాలు పెట్టుకుంటే శుభప్రదమని తెలుసుకున్నాం. ప్రస్తుతం ఇంట్లో బుద్ధుడు విగ్రహాలు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. బుద్ధుడి విగ్రహాలను ఇళ్ళల్లో పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అసలు చేయకూడనివి ఏంటి? తదితర వివరాలను తెలుసుకుందాం.

vastu tips: ఇంట్లో గుర్రాల బొమ్మలు పెట్టొచ్చా.. వాస్తు, ఫెంగ్ షుయ్ ఏం చెప్తుంది?vastu tips: ఇంట్లో గుర్రాల బొమ్మలు పెట్టొచ్చా.. వాస్తు, ఫెంగ్ షుయ్ ఏం చెప్తుంది?

బుద్ధుడి ప్రతిమ ఇళ్ళలో ఉంటే పాజిటివ్ ఎనర్జీ

బుద్ధుడి ప్రతిమ ఇళ్ళలో ఉంటే పాజిటివ్ ఎనర్జీ


బుద్ధుడు శాంతి మరియు జ్ఞానానికి ప్రతీక. బౌద్ధ మతాన్ని స్థాపించిన బుద్ధుడు ప్రపంచానికి శాంతిని ప్రబోధించాడు. అటువంటి బుద్ధుడి ప్రతిమ ఇంట్లో ఉంచుకుంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. బుద్ధుడి ప్రతిమ ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతున్నారు. చేతి వేళ్ళు వాస్తు శాస్త్రం ప్రకారం పంచభూతాలకు ప్రతీకలుగా చెబుతారు. చిన్మయ ముద్రలో ఉన్న బుద్ధుడి రూపాన్ని పూజ గదిలో, మెడిటేషన్ జోన్లో, స్టడీ రూమ్ లో పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

బుద్ధుడి విగ్రహాలను పెట్టటానికి సరైన స్థితి

బుద్ధుడి విగ్రహాలను పెట్టటానికి సరైన స్థితి


వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రమే కాకుండా, ఫెంగ్ షుయ్ ప్రకారం కూడా గౌతమ బుద్ధుని విగ్రహాలు ఇళ్లల్లో పెట్టుకోవడం శుభప్రదమైనది . అవి అదృష్టాన్ని కలిగిస్తాయి. బుద్ధుని విగ్రహాలు ఇంట్లో సరైన స్థితిలో ఉంచితే అవి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇంట్లో స్లీపింగ్ బుద్ధ విగ్రహాలను పెట్టుకోవాలి అనుకుంటే వాటిని పడమర దిక్కు లో పెట్టుకోవడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక భూమి స్పర్శ ముద్ర ఉన్న బుద్ధుని విగ్రహం తూర్పువైపున ఉంచితే ఇంట్లో వారందరికీ శాశ్వతమైన జ్ఞానం లభిస్తుందని చెబుతున్నారు.

 వాస్తుదోష నివారణకు ఆశీర్వాద బుద్ధుడు.. నీటి ఫౌంటెన్ తో బుద్ధుడు ఉంటే ఈశాన్యం బెస్ట్

వాస్తుదోష నివారణకు ఆశీర్వాద బుద్ధుడు.. నీటి ఫౌంటెన్ తో బుద్ధుడు ఉంటే ఈశాన్యం బెస్ట్


రక్షణ లేదా ఆశీర్వాద బుద్ధుని విగ్రహం వాస్తు దోష నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీనిని ప్రధాన ద్వారం ఎదురుగా ఉంచితే సత్ఫలితాలు ఉంటాయని చెబుతారు. అలాగే పద్మాసనంలో కూర్చుని ప్రార్థన చేస్తూ రెండు చేతులు జోడించి ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని పూజ గదిలో కానీ, ప్రధాన ప్రవేశం వద్ద కానీ, డైనింగ్ రూమ్ లో కాని ఉంచితే మంచిదని చెబుతున్నారు. ఇక జ్ఞాన భంగిమలో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని ప్రార్ధనా గదిలో కానీ, బాల్కనీలో కానీ ఉంచవచ్చని సూచిస్తున్నారు. ఈశాన్యం వైపున కూడా చిన్న నీటి ఫౌంటెన్ తో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకుంటే కలిసొస్తుందని చెబుతున్నారు.

వాస్తు ప్రకారం బుద్ధుడి విగ్రహాలను పెట్టేటప్పుడు చెయ్యకూడని తప్పులివే

వాస్తు ప్రకారం బుద్ధుడి విగ్రహాలను పెట్టేటప్పుడు చెయ్యకూడని తప్పులివే


ఇక గృహ వాస్తు ప్రకారం బుద్ధుని విగ్రహాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదని విగ్రహాన్ని పాల రాతి పలక మీద కానీ ఏదైనా బల్లపై కానీ, కనీసం చాప పైన పెట్టాలని నేరుగా భూమి మీద పెట్టడం మంచిది కాదని సూచించబడింది. అలాగే బుద్ధుని విగ్రహానికి నేరుగా ఎవరి పాదాలు ఉండకుండా ఎత్తైన ప్రదేశంలో పెట్టాలని సూచించబడింది. విగ్రహం చుట్టూ ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని విగ్రహం వద్ద గాలిని శుద్ధి చేయడం కోసం అగరవత్తులు వెలిగించాలని సూచించబడింది వంట గదులు, పడక గదులు, బాత్ రూమ్ లకు సమీపంలో బుద్ధుడి విగ్రహాలను పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రికల్ అవుట్లెట్లు లేదా షూ రాక్స్ పైన బుద్ధుడి విగ్రహాలను పెట్టడం మంచిది కాదని సూచిస్తున్నారు.

English summary
Do you keep Buddha statues in houses? But you need to know what kind of Buddha statue should be placed in which direction and what not to do in the case of a Buddha statue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X