వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: వాహనాల పార్కింగ్ కు వాస్తునియమాలు; ఆ దిశలో పెడితే మీవెంటే ప్రమాదాలు!!

|
Google Oneindia TeluguNews

ఇంటిని నిర్మించుకోవడానికి, ఇంట్లో వస్తువులను పెట్టుకోవడానికి వాస్తు ఏ విధంగా అయితే ఉంటుందో, ఇంట్లో వాహనాల పార్కింగ్ కు కూడా వాస్తు నియమాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నేడు సమాజంలో ప్రస్తుతం చాలామంది కార్లను ఉపయోగిస్తున్నారు. ఇక కార్లను వాడుతున్నవారు ఇళ్ళల్లో కార్లు పార్కింగ్ చేసుకోవడానికి సరైన వాస్తు శాస్త్ర చిట్కాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

వాహనాల పార్కింగ్ కు వాస్తు నియమాలు.. పాటించకుంటే ప్రమాదాలు మీ వెంటే

వాహనాల పార్కింగ్ కు వాస్తు నియమాలు.. పాటించకుంటే ప్రమాదాలు మీ వెంటే


మీ సొంత వాహనాలు కార్లు లేదా బైక్, స్కూటర్ ఏదైనా సరైన దిశలో పార్క్ చేస్తే మీరు గ్యారేజీని మెరుగైన మార్గంలో ఉపయోగించుకోగలుగుతారని వాస్తు పేర్కొంది. ఏదైనా వాహనం యొక్క తప్పు పార్కింగ్ మానసిక ఒత్తిడికి దారితీయవచ్చునని, ప్రమాదాలు వంటి భౌతిక నష్టం లేదా ఆర్థిక నష్టాలు కూడా కలిగించవచ్చునని వాస్తు చెప్తుంది. ఏ దిశలో కార్లు, ద్విచక్ర వాహనాలు పార్క్ చేయాలి అనేది తెలుసుకోకపోతే, వాస్తు నియమాలను పాటించక పోతే ఖచ్చితంగా వాహనాలు ప్రమాదాలకు గురికావడం, లేక నిరంతరం రిపేర్లతో ఇబ్బంది పెట్టడం జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 వాహనాల పార్కింగ్ కు అనుకూలమైన దిశలు ఇవే

వాహనాల పార్కింగ్ కు అనుకూలమైన దిశలు ఇవే


ముఖ్యంగా వాహనాలను పార్క్ చేయడానికి తూర్పు లేదా ఉత్తర దిశ అనువైనది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వాహనాలను పార్క్ చేసుకోడానికి కొంతమంది ఇళ్ళ ముందు చిన్న షెడ్లను ఏర్పాటు చేసుకుంటారు. ఇక అటువంటి షెడ్ల గేట్ల ఎత్తు, ఇంటి ప్రధాన గేటు కంటే ఎక్కువ ఎత్తులో ఉండకూడదని చెబుతున్నారు. అంతేకాదు ఇంటి గోడను ఆనుకుని ఈ నిర్మాణం చేయించటం మంచిది కాదు. ఇక ఇలా ఉంటే వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

నైరుతిలో కార్ల పార్కింగ్ శుభప్రదం

నైరుతిలో కార్ల పార్కింగ్ శుభప్రదం


ఇంటికి నైరుతి భాగంలో వరండా ఉంటే కార్లను పార్క్ చేయవచ్చని, నైరుతి భాగంలో కార్లను పార్క్ చేయడం శుభప్రదమని చెబుతున్నారు. ఇక వాహనం యొక్క ముందు భాగాన్ని దక్షిణం వైపుగా పార్క్ చేయవద్దని, అలా చేస్తే నిర్వహణ ఖర్చు పెరుగుతుందని, తరచూ వారిని రిపేర్ లతో వాహనాలు ఇబ్బందిపెడతాయి అని చెబుతున్నారు. ఇక వాహనాలను పార్కింగ్ చేసే విషయంలో ఈశాన్య భాగంలో పార్క్ చేయడం వల్ల ఆర్థికంగా ధన నష్టం వాటిల్లుతుందని, మానసిక ఒత్తిడి పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఈశాన్యంలో వాహనాల పార్కింగ్ మంచిది కాదు

ఈశాన్యంలో వాహనాల పార్కింగ్ మంచిది కాదు


ఇంటికి ఈశాన్యంలో వాహనాలను పార్క్ చేస్తే ఆ ఇంట్లో పరిస్థితులు దారుణంగా మారుతాయని చెబుతున్నారు. వాహనాలను పార్క్ చేయడానికి నైరుతిదిశలో స్థలం లేకపోతే ఆగ్నేయ భాగంలో పార్క్ చేయవచ్చని చెబుతున్నారు. ఇక వాయువ్య దిశలో కూడా వాహనాలను పార్కింగ్ చేయవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
There are Vastu rules for vehicle parking in front of the house. It is said that parking of vehicles in the south-west, east and north directions is auspicious. It is said that if you don't follow Vastu, accidents may happen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X