Vastu tips: ఎంత డబ్బు సంపాదించినా నిలవటం లేదా? ఈ చిట్కాలు పాటిస్తే డబ్బే డబ్బు!!

ప్రతి ఒక్కరూ బాగా డబ్బు సంపాదించాలని తాపత్రయపడుతుంటారు. ఆర్థికంగా బలోపేతంగా ఉన్నప్పుడే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారని బలంగా నమ్ముతారు. అందుకే డబ్బు సంపాదించడం కోసం అహర్నిశలు కష్టపడతారు. అయినప్పటికీ కొంత మందికి ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. ఎంతో కష్టపడి వారు సంపాదించిన డబ్బు, వారే ఊహించని విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇక ఆ విధంగా డబ్బు ఖర్చయ్యే వారు వాస్తు శాస్త్ర నియమాలను అనుసరించి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే డబ్బులు కాపాడుకోవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతుంటే ఈ పని చెయ్యండి

డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతుంటే ఈ పని చెయ్యండి

ఇంట్లో లక్ష్మీదేవి ఆశీర్వాదం లేకపోతే ఆమె అనుగ్రహం పొందడానికి, ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి వాస్తు శాస్త్రంలో నివారణలు ఇవ్వబడ్డాయి. ఇక అందులో కొన్నిటిని ఇక్కడ చూద్దాం. ఇంట్లో ఎప్పుడూ డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుందని భావించేవారు ఏడు గవ్వలను శుభ్రమైన ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచండి. ఇది ఇంట్లో శ్రేయస్సును తీసుకు వస్తుందని డబ్బుకు ఎప్పుడూ కొరత లేకుండా చూస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

డబ్బులు బాగా రావాలంటే లాకర్ లో ఇవి పెట్టండి

డబ్బులు బాగా రావాలంటే లాకర్ లో ఇవి పెట్టండి

ఇక ఇదే సమయంలో వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల డబ్బు వస్తుంది. వీటిలో కొత్త నోట్లు కూడా ఉన్నాయి. కొత్త నోట్ల కట్టలోని ఒక నోట్ ను కనీసం ఇంటి లాకర్ లో భద్రంగా ఉంచితే డబ్బు ఖర్చు కాకుండా ఉంటుందని చెబుతున్నారు . ఈ నోట్లు పాతవి కాకుండా కొత్తగా ఉండాలని, వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు .

 కుబేరుడి అనుగ్రహం ఉంటేనే డబ్బు.. అయన అనుగ్రహం కోసం ఇది చెయ్యండి

కుబేరుడి అనుగ్రహం ఉంటేనే డబ్బు.. అయన అనుగ్రహం కోసం ఇది చెయ్యండి

ధనానికి దేవుడు కుబేరుడు కాబట్టి, సంపదకు మూలమైన కుబేరుడు అనుగ్రహం పొందాలంటే కుబేరుడు విగ్రహాన్ని, లేదా చిత్రాన్ని లాకర్లలో ఉంచాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దీంతో డబ్బు రావడంతో పాటు, లాభాలు పెరిగి ఆర్థిక పరిస్థితి బలపడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇంట్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభం ఉండకూడదని భావిస్తే ఈ చిట్కా పాటించాలని సూచిస్తున్నారు.

లాకర్ లో అద్దం ఉంటే ఫలితం ఇలా

లాకర్ లో అద్దం ఉంటే ఫలితం ఇలా

లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ మీపై ఉండాలని మీరు కోరుకుంటే, దీని కోసం ఖజానా లేదా లాకర్‌లో చిన్న అద్దం, ఉంచాలని చెబుతున్నారు. మీరు తలుపు తెరిచినప్పుడల్లా మీకు కనిపించే విధంగా అద్దాన్ని లాకర్‌లో ఉంచండి. అప్పుడు ధనం రెట్టింపు అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో లక్ష్మీదేవికి నచ్చని వస్తువులను, పనికిరాని వస్తువులను ఎప్పుడూ లాకర్లో ఉంచరాదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

లాకర్లలో ఈ వస్తువులు పెట్టకండి.. పెడితే ధననష్టం

లాకర్లలో ఈ వస్తువులు పెట్టకండి.. పెడితే ధననష్టం

చాలామంది లాకర్లలో తాళం చెవులు, ఫోటోలు, ఇతరత్రా పత్రాలు, కొన్ని వస్తువులను పెడుతూ ఉంటారు. డబ్బుకు సంబంధించిన లాకర్లో, ధనానికి సంబంధించిన వాటిని మాత్రమే పెట్టాలని, ఇతరత్రా వస్తువులు పెట్టడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదని బాధపడేవారు ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి సంపన్నులుగా మారాలని వాస్తు శాస్త్ర పండితులు సలహా ఇస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+