vastu tips: ఈ వీధిపోటు ఉంటే వెయ్యి ప్రయత్నాల్లో 999 ప్రయత్నాలు ఫెయిల్ అవుతాయి!!

వాస్తు గురించి తెలుసుకునే వారు, ముఖ్యంగా వీధి పోటు గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఒక స్థలాన్ని కానీ ఇంటి గాని కొనుగోలు చేసేటప్పుడు, ఆ ఇంటికి గాని స్థలానికి కానీ ఏదైనా వీధిపోటు ఉందా అన్నది తెలుసుకోవాలి. ఏ విధమైన వీధిపోటు ఉంది? అది మంచిదా కాదా అనేది తెలిసి ఉండాలి? ఇక అటువంటి వాస్తు అవగాహన కోసమే వివిధ వీధిపోట్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం.

ఈ వీధిపోటు ఉంటే పుట్టెడు సమస్యలే

ఈ వీధిపోటు ఉంటే పుట్టెడు సమస్యలే

కొన్ని వీధిపోట్లు లాభాలను, శ్రేయస్సును కలిగిస్తే, కొన్ని వీధిపోట్లు ఊహించని కష్టాలను, నష్టాలను, ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తాయి. ఇక నష్టపరిచే ఒక వీధిపోటు విషయానికి వస్తే తూర్పు ఆగ్నేయ వీధి పోటు. ఈ వీధి పోటు ఉన్న ఇళ్ళ స్థలాలను కొనుగోలు చేయకూడదు. తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఉన్న ఇళ్ళ స్థలాలను కొనుగోలు చేసే వారికి సుఖం కోటి దివిటీలతో వెతికినా కనిపించదు. వారి జీవితమంతా కష్టాలు ఉంటాయి. తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఉన్న ఇంట్లో నివసించే వారు ఎప్పుడు పుట్టెడు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటారు.

ఎక్కడికి వెళ్లినా విజయం ఎండమావే

ఎక్కడికి వెళ్లినా విజయం ఎండమావే

తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఉందంటే ఆ ఇంట్లో నివసించే వారి జీవితం అల్లకల్లోలంగా ఉన్నట్టు లెక్కే. వారు ఎంత ప్రయత్నం చేసినా ఎంత కష్టపడినా వారి జీవితంలో జయం అనేది ఉండదు. ఏ పని చేసినా అపజయమే. ఏది ముట్టుకున్నా దరిద్రమే. ఈ వీధి పోటు ఉన్న ఇంట్లో నివసించే వారు ఎప్పుడు మనశ్శాంతిగా ఉండరు.

వారి వృత్తి లోను, వ్యాపారం లోనూ రాణించలేరు. ఎక్కడికి వెళ్లినా విజయం ఎండమావే అవుతుంది. 1000 ప్రయత్నాలు చేస్తే 999 ప్రయత్నాలు విఫలమవుతాయి. ఒక్క ప్రయత్నం కూడా ఫలిస్తుంది అన్న గ్యారెంటీ ఉండదు.

ఈ వీధిపోటు ఉన్న స్థలాన్ని కొనుగోలు చెయ్యటం కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే

ఈ వీధిపోటు ఉన్న స్థలాన్ని కొనుగోలు చెయ్యటం కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే

అందుకే తూర్పు ఆగ్నేయం వీధి పోటు ఉన్న ఇళ్ల స్థలాలను కానీ, ఇళ్లను కానీ కొనుగోలు చేయకూడదు. ఇటువంటి స్థలాల్లో ఉండటంవల్ల అది ఆ కుటుంబ సభ్యుల జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇటువంటి స్థలాలు తక్కువ రేట్ కి వచ్చిన కొనుగోలు చేయకూడదని వీధి పోటు ఉన్న స్థలాలను కొనుగోలు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఉన్న స్థలాన్ని కొనుగోలు చేయకుండా, ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సలహా ఇస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పొరపాటున కొనుగోలు చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే నని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+