వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న ఇళ్ళలో వాస్తు దోషాలు; మీరు ఊహించని ఆర్ధిక కష్టాలు!!

వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం అటాచ్డ్ బాత్రూమ్ లను నిర్మించుకోవాలని, ఇక వీటి నిర్వహణలోనూ వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

ఒకప్పుడు మన ఇళ్లల్లో ఇంటి లోపల బాత్రూం లో ఉండేవి కాదు. టాయిలెట్ కి వెళ్ళాలంటే ఇంటి బయట చాలా దూరం నడిచి వెళ్లి మరి టాయిలెట్ కి వెళ్లవలసి ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్న జీవన శైలి నేపథ్యంలో ఇంట్లోనే అన్ని అనుకూలతల కోసం అటాచ్డ్ బాత్రూమ్ లను నిర్మిస్తున్నారు. అయితే వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం అటాచ్డ్ బాత్రూమ్ లను నిర్మించుకోవాలని, ఇక వీటి నిర్వహణలోనూ వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అటాచ్డ్ బాత్ రూమ్ ల విషయంలో పొరబాట్లు చేస్తే జరిగే అనర్దాలివే

అటాచ్డ్ బాత్ రూమ్ ల విషయంలో పొరబాట్లు చేస్తే జరిగే అనర్దాలివే

వాస్తు శాస్త్రంలో ఇంటి అటాచ్డ్ టాయిలెట్ నిర్మించడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు పేర్కొన్నారు. అటాచ్డ్ టాయిలెట్లు నిర్మించుకునేవారు వాస్తు నియమాలను పాటించకపోతే జీవితం అనేక ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటాచ్డ్ టాయిలెట్లు నిర్మాణంలో చేసే పొరపాట్లు, వాటి వినియోగంలో చేసే వాస్తు దోషాలు మనకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. డబ్బు వృధాకు దారితీస్తాయి. అటాచ్డ్ టాయిలెట్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఇంట్లో పేదరికం వచ్చి పడుతుంది.

అటాచ్డ్ బాత్ రూమ్ ఇలా అస్సలు ఉండకూడదు

అటాచ్డ్ బాత్ రూమ్ ఇలా అస్సలు ఉండకూడదు

ఇక అటాచ్డ్ బాత్రూంలో విషయంలో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల విషయానికి వస్తే ఎప్పుడూ అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న గదిని శుభ్రంగా ఉంచాలి. అటాచ్డ్ బాత్రూం నీట్ గా లేకపోతే, ఆ బాత్రూం అటాచ్ గా ఉన్న గదిలో నిద్రించే వారి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం ఉంటుంది. మురికిగా ఉన్న బాత్రూమ్ మనల్ని పేదలుగా మారుస్తుంది. గదిలో పడుకునే వ్యక్తి యొక్క నిద్ర చెడిపోతుంది. ఇక అంతే కాదు అటాచ్డ్ బాత్రూమ్ లు ఉన్నవారు ఎప్పుడూ ఆ బాత్రూమ్ తలుపులను మూసే ఉంచాలి. బాత్రూం తలుపులను తెరిచి ఉంచడం వాస్తు దోషంగా పరిగణించబడుతుంది.

అటాచ్డ్ టాయిలెట్ విషయంలో వాస్తు దోషాలుంటే తీవ్రమైన కష్టాలు, ఆర్ధిక నష్టాలు

అటాచ్డ్ టాయిలెట్ విషయంలో వాస్తు దోషాలుంటే తీవ్రమైన కష్టాలు, ఆర్ధిక నష్టాలు

ఇంకా బెడ్ రూమ్ కి అటాచ్డ్ గా బాత్రూం ఉంటే బెడ్రూంలో పడుకునే వారి పాదాలు బాత్రూం వైపు ఉండకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ బాత్రూం వైపు కాళ్ళు పెట్టి పడుకుంటే, ఆ ఇంట్లోని భార్యాభర్తలు ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతాయి. అటాచ్డ్ బాత్రూంలో ఎప్పుడూ లోపల పగిలిపోయి కానీ, ట్యాప్ లు లీక్ అవుతూ కానీ, శిథిలమైపోయి కానీ ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే తీవ్రమైన కష్టాలు, ధన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అటాచ్డ్ బాత్రూం లో చెత్తాచెదారం జమ చేస్తే దాని ప్రభావం మన జీవితం పైన కచ్చితంగా ఉంటుంది.

బాత్ రూమ్ వాస్తు దోషాలు పోవాలంటే ఈ చిట్కా ట్రై చెయ్యండి

బాత్ రూమ్ వాస్తు దోషాలు పోవాలంటే ఈ చిట్కా ట్రై చెయ్యండి

ఇక బాత్రూంలో వాస్తు దోషాలను కలిగించే చిన్న చిన్న ఇబ్బందులను తొలగించుకోవడానికి చిన్న గిన్నె నిండా ఉప్పు పోసి ఆ ఉప్పును బాత్రూంలో ఉంచండి. ఇక ప్రతి వారం ఆ ఉప్పును బయటపడేసి మళ్లీ కొత్త ఉప్పుతో మార్చండి. ఇలా చేయడం వల్ల చాలా వాస్తు దోషాలు తొలగిపోతాయని ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని వాస్తు శాస్త్రం నిపుణులు చెప్తున్నారు.

అటాచ్డ్ బాత్ రూమ్ విషయంలో రంగుల ఎంపికలోనూ జాగ్రత్త

అటాచ్డ్ బాత్ రూమ్ విషయంలో రంగుల ఎంపికలోనూ జాగ్రత్త

అంతేకాదు అటాచ్డ్ బాత్రూంలో ఉపయోగించే టైల్స్ ను లేతరంగు టైల్స్ మాత్రమే ఉపయోగిస్తే మంచిది. బాత్రూం గోడలపై స్కై బ్లూ కలర్, క్రీమ్ కలర్, లేత ఊదా రంగులను వేస్తే బాగుంటుంది. పొరపాటున కూడా బాత్రూంలో నలుపు, లేదా గోధుమ రంగులను వెయ్యకూడదు. ఈ చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఇంట్లో ఆర్థిక నష్టాలను నివారించడంతోపాటు కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంటుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

vastu tips: భార్యాభర్తల ప్రేమ బలపడాలంటే బెడ్ రూమ్ లో మీరు చెయ్యాల్సింది ఇదే!!vastu tips: భార్యాభర్తల ప్రేమ బలపడాలంటే బెడ్ రూమ్ లో మీరు చెయ్యాల్సింది ఇదే!!

English summary
In Vastu Shastra, some important rules have been mentioned for constructing attached bathrooms or toilets at home. Those constructing attached toilets, if they do not follow the Vastu rules, life will have to face many disadvantages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X