వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ఈ మూడుతప్పులు చేస్తే ఎంత సంపాదించినా బూడిదలో పోసినట్టే.. ఇప్పుడే సరిదిద్దుకోండి

|
Google Oneindia TeluguNews

చాలామంది ఎంతో కష్ట పడుతూ ఉంటారు. పొదుపు చేయాలని కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కుంగదీస్తుంటాయి. తాము చేసే పనితో ఎటువంటి శక్తివంచన లేకుండా ప్రయత్నించినా వారు మాత్రం విజయం సాధించలేరు. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇళ్ళల్లో డబ్బు నిలవదు, ఆదాయానికి, ఖర్చులకు మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల వారు పేదవారిగా మారతారు. ఇక అటువంటి వారు కొన్ని వాస్తు చిట్కాలు తెలుసుకోవడం వారి సమస్యలకు కొంతమేరకైనా ఉపశమనం కలిగిస్తుంది.

మూడు మూలలలో వాస్తు పాటించకుంటే ఎంత సంపాదించినా అంతే

మూడు మూలలలో వాస్తు పాటించకుంటే ఎంత సంపాదించినా అంతే

జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం ప్రకారం ఆర్థికంగా ఓ వ్యక్తి పేదవాడు అవుతున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంటి వాస్తు సరిగా లేకపోవడం, వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు వారిని వెనక్కి లాగుతూ ఉంటాయి. ఇక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారి ఇంటికి సంబంధించి పేదరికానికి కారణంగా ఇంట్లో ప్రధానంగా ఒక మూడు మూలల ప్రభావం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ మూడు మూలలు ఏమిటంటే..

 వాటర్ ట్యాంక్.. ఆ దిశలో ఉంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు

వాటర్ ట్యాంక్.. ఆ దిశలో ఉంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు

ఇంటి పై కప్పు మీద ఉండే వాటర్ ట్యాంక్ లను ఆగ్నేయ దిశలో ఉంచితే చాలా నష్టం జరుగుతుంది. ఆగ్నేయ దిశలో వాటర్ ట్యాంక్ ఉంటే ఆ వ్యక్తి పేదరికాన్ని అనుభవించక తప్పదు. ఆగ్నేయ దిశ వాస్తవానికి అగ్నిప్రదేశం. అగ్ని స్థానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. దీంతో వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు ఇంట్లో తరచూ గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు, వాదోపవాదాలు చోటు చేసుకుంటాయి.

వాటర్ ట్యాంక్ ఈ దిశలో ఉంటే మంచిది

వాటర్ ట్యాంక్ ఈ దిశలో ఉంటే మంచిది


కనుక వీలైనంతవరకూ వాటర్ ట్యాంక్ ను నైరుతి దిశలో నిర్మించుకుంటే మంచిది. ఎందుకంటే నైరుతి దిశ సానుకూల ప్రతికూల శక్తులను సమతుల్యం చేస్తుంది. అలా కాకుంటే రెండవ ఆప్షన్ గా దక్షిణ దిశలో వాటర్ ట్యాంక్ ఉంటే మంచిది. దక్షిణ దిశలో వాటర్ ట్యాంక్ నిర్మిస్తే ట్యాంకు స్లాబ్ కు మధ్య కనీసం 1,2 అడుగుల ఖాళీ స్థలాన్ని ఉంచటం మంచిదని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.

 మరుగుదొడ్డి అక్కడ ఉంటే ఎంత సంపాదించినా అంతే

మరుగుదొడ్డి అక్కడ ఉంటే ఎంత సంపాదించినా అంతే


ఆ తర్వాత వాస్తు ప్రకారం చూసుకోవలసిన మరొక ప్రదేశం మరుగుదొడ్డి. ఇంట్లో ఈశాన్య దిశలో మరుగుదొడ్డి నిర్మించినట్లు అయితే ఆ వ్యక్తికి డబ్బు సమస్యలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ పొరపాటు చేస్తే ఇది ఆర్థికంగా మిమ్మల్ని బలహీనపరిచటమే కాకుండా, ఆరోగ్య సంబంధమైన సమస్యలను కూడా సృష్టిస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఇంటికి ఈశాన్య దిశలో ఎప్పుడూ మరుగుదొడ్డి నిర్మించవద్దని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అలా ఇంటికి ఈశాన్యంలో మరుగుదొడ్లు ఉంటే ఎంత కష్టపడినా ఫలితం మాత్రం బూడిదలో పోసిన పన్నీరు గానే మారుతుందని చెబుతున్నారు.

 ఇక ఇంటికి ఉత్తరం దిక్కు శుభ్రంగా లేకున్నా అంతే సంగతి

ఇక ఇంటికి ఉత్తరం దిక్కు శుభ్రంగా లేకున్నా అంతే సంగతి

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు దుమ్ముధూళి లేకుండా, చెత్తాచెదారం జమ చేయకుండా శుభ్రంగా ఉంచాలి. ఎందుకంటే ఇంటికి ఉత్తరం దిశ కుబేరుడి దిశ. కుబేర స్థానంలో ఎప్పుడూ చెత్తాచెదారం ఉంచకూడదు. ఒకవేళ అలా ఉంచితే అది పేదరికానికి కారణం అవుతుంది. అంతే కాదు ఇంట్లో వాళ్ల అనారోగ్యానికి కూడా కారణంగా మారుతుంది. ఉత్తర దిశ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది. కాబట్టి ఉత్తర దిక్కు లో ఎటువంటి చెత్తాచెదారం జమ చేయకూడదు. పొరపాటున కూడా ఆ దిక్కున పాత సామాన్లు పడ వేయకూడదు. ఉత్తరదిక్కు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద నిలబడుతుంది. ముఖ్యంగా ఈ మూడు విషయాలు గుర్తు పెట్టుకుంటే కొంతమేరకు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి, డబ్బు నిలబడుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Vastu Shastra experts say that building a water tank in the south-east, garbage disposal in the north, and building a toilet in the north-east of the house will not last, no matter how much money is earned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X