Vastu tips: మీరు హ్యాపీగా ఉండాలంటే నిద్ర లేచిన వెంటనే ఈ పనులు అస్సలు చెయ్యకండి!!

ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలంటే పాటించాల్సిన వాస్తు నియమాలు ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు మన జీవితాన్ని ఎంత ఆనందంగా ప్రారంభిస్తామో.. ఎంత సంతోషంగా, ఉత్సాహంగా ప్రారంభిస్తామో అంతే ఉత్సాహంగా ఆ రోజంతా ఉంటుంది. చాలా మంది ఉదయం నిద్ర లేచిన వెంటనే చేసే పనిపై ఆ రోజంతా వారి సంతోషం ఆధారపడి ఉంటుంది. అందుకే నిద్ర లేచిన వెంటనే ఏం చేయాలి? ఎటువంటి పనులు చేయకూడదు? అనే అంశాలపై కచ్చితంగా ఒక అవగాహన ఉండాలి.

ఉదయం నిద్రలేచిన వెంటనే చెయ్యకూడని పనులు

ఉదయం నిద్రలేచిన వెంటనే చెయ్యకూడని పనులు

వాస్తు శాస్త్రం ప్రకారం నిద్ర లేచిన వెంటనే ఏం చేయకూడదు? ఏం చేస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వెల్లడించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు తో పాటుగా జీవితంలో కూడా అనేక మంచి మార్పులను తీసుకు రావచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే అద్దాన్ని చూడకూడదు. చాలామందికి లేవగానే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది. కానీ అది తప్పు అని, అద్దంలో ఉదయం లేవగానే ముఖం చూసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

నిద్ర లేచిన వెంటనే వేరొకరి ముఖం చూస్తే జరిగేదిదే

నిద్ర లేచిన వెంటనే వేరొకరి ముఖం చూస్తే జరిగేదిదే

అంతేకాదు ఉదయం నిద్ర లేచిన వెంటనే వేరొకరి ముఖాన్ని చూడటం కూడా ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. నిద్ర లేచిన వెంటనే వేరొకరి ముఖాన్ని చూడటం వల్ల ఆ వ్యక్తి యొక్క ప్రతికూల శక్తి మీపై పని చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఉదయం నిద్ర లేచిన వెంటనే సానుకూలంగా ఆ రోజును ప్రారంభించాలి. అందుకే నిద్ర లేచిన వెంటనే ఎవరితోనూ వాగ్వాదానికి దిగకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

నిద్రలేచిన వెంటనే జంతువులను, టీవీలను చూస్తున్నారా? ఫలితం ఇదే

నిద్రలేచిన వెంటనే జంతువులను, టీవీలను చూస్తున్నారా? ఫలితం ఇదే


ఉదయం నిద్రలేవగానే కొంతమంది పెంపుడు జంతువులను చూస్తారు. ఇది కూడా ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే నిద్ర లేవగానే టీవీ చూడడాన్ని, వార్తాపత్రికలు చదవడాన్ని కూడా మానుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని, ఉదయం ప్రశాంతంగా ఉన్న మెదడును ఈ చర్యలు దెబ్బతీస్తాయని చెబుతున్నారు. అయితే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇంతకీ ఏం చేయాలనే దాని పైన కూడా వాస్తుశాస్త్ర నిపుణులు పలు సూచనలు చేశారు.

నిద్ర లేవగానే చెయ్యాల్సిన పనులివే

నిద్ర లేవగానే చెయ్యాల్సిన పనులివే


ఉదయం నిద్ర లేచిన వెంటనే ప్రతి ఒక్కరు తమ చేతుల రేఖలను చూసుకొని భగవంతుని స్మరించుకోవాలి. చేతుల అగ్రభాగంలో లక్ష్మీ దేవి నివసిస్తుందని, మధ్యలో సరస్వతీ నివసిస్తుందని, చేతుల మూలలో పార్వతీ దేవి నివసిస్తుందని ముగ్గురు దేవతలు ఉన్న చేతులను ఉదయం చూసుకోవడం భగవంతుని దర్శించుకోవడంతో సమానమని చెబుతున్నారు. ఇలా ప్రతిరోజు మన చేతులను మనమే చూసుకోవడం వల్ల ఆ రోజంతా ఆ భగవంతుని కృప మనపై ఉంటుందని చెబుతున్నారు. ఇది ఇంట్లో సానుకూల వాతావరణంతో పాటు, మనలోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+