వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: శ్రావణ మాసంలో ఈ ఐదు మొక్కలు నాటితే అద్భుతమైన ప్రయోజనాలు

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రంలో రుతువులకు, కాలాలకు కూడా ముఖ్యమైన స్థానం ఉంటుంది. ఎండాకాలంలో ఎటువంటి పనులు చేస్తే ప్రయోజనాలు చేకూరుతాయనేది చెప్పినట్టే, వర్షాకాలంలో ఎటువంటి పనులతో సుఖమయ జీవితం ఉంటుంది అన్నది వాస్తు శాస్త్రం వివరించింది. వర్షాకాలంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇళ్లల్లో కానీ బయట కానీ వర్షాకాలంలో మొక్కలను పెడితే జీవితంలో పురోభివృద్ధి ఉంటుందని వాస్తు శాస్త్రం పేర్కొంది.

శ్రావణ మాసంలో నాటవలసిన ఐదు మొక్కలు ఇవే.. వీటితో విశేషమైన ఫలితాలు

శ్రావణ మాసంలో నాటవలసిన ఐదు మొక్కలు ఇవే.. వీటితో విశేషమైన ఫలితాలు

అయితే శ్రావణ మాసంలో ముఖ్యంగా ఐదు మొక్కలు నాటడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలు నాటడం వల్ల ఇంట్లో కుటుంబ కలహాలు, ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితులు రాకుండా ఉంటాయని, శ్రావణ మాసంలో ఈ మొక్కలు నాటడం శ్రేయస్కరమని చెబుతున్నారు. ఇక ఆ మొక్కలను గురించి తెలుసుకుందాం.

 శ్రావణ మాసంలో జమ్మి మొక్క నాటడం వల్ల సమస్యలు దూరం

శ్రావణ మాసంలో జమ్మి మొక్క నాటడం వల్ల సమస్యలు దూరం

వాస్తు శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో నాటవలసిన మొక్కలలో ముఖ్యమైన మొక్క జమ్మి మొక్క. ఈ మాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి, ఈ మాసంలో ఇంట్లో శమీ మొక్కను నాటడం చాలా శ్రేయస్కరం అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇంట్లో జమ్మి మొక్కను నాటలేకపోతే, ఇంటి బయట ఆవరణలో నైనా జమ్మి చెట్టును నాటవచ్చు అని చెబుతున్నారు. ఈ చెట్టును పెట్టడం వల్ల ఇంట్లో ఎలాంటి లోటు ఉండదని విశ్వాసం. అంతే కాదు శమీ వృక్షం గా చెప్పబడే జమ్మి చెట్టును నిత్యం పూజించడం వల్ల ఇంట్లోని సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు.

మనీ ప్లాంట్ నాటితే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడమే

మనీ ప్లాంట్ నాటితే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడమే

వాస్తు శాస్త్రం ప్రకారం, శ్రావణ మాసంలో మనీ ప్లాంట్ ను నాటడం, లక్ష్మి దేవిని ఇంట్లోకి ఆహ్వానించడమేనని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మనీ ప్లాంట్ ను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభం ఉండదు. మనీ ప్లాంట్ ఎంత వేగంగా పెరుగుతుందో, ఇల్లు అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. శ్రావణ మాసంలో ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని చెప్తున్నారు.

తులసి మొక్క నాటితే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు

తులసి మొక్క నాటితే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు

అంతేకాదు శ్రావణ మాసంలో తులసి మొక్కను నాటితే, మీ ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుందని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. తులసి మొక్క ఎంత పచ్చగా ఉంటే మీ ఇంట్లో అంత పురోభివృద్ధి జరుగుతుందని పేర్కొంది. ఇంటి ఈశాన్య మూలలో తులసి మొక్కను నాటడం శుభప్రదం అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దూబ్ గ్రాస్ ను పెంచడం సానుకూల శక్తి కి ఆహ్వానం

దూబ్ గ్రాస్ ను పెంచడం సానుకూల శక్తి కి ఆహ్వానం

వాస్తు ప్రకారం, శ్రావణ మాసంలో దూబ్ గ్రాస్ ను పెంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని చెబుతున్నారు. ఈ మొక్క యొక్క ఆకులు పచ్చగా ఉంటే, ఇంట్లో ఎక్కువ ఆనందం ఉంటుందని, మొక్క ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండాలని సూచిస్తున్నారు. ఇంటికి ఎదురుగా ఈ గ్రాస్ ను పెంచడం వల్ల ఇల్లు సంతోషంగా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు

ఉమ్మెత్త మొక్కను పెంచితే పరమ శివుని అనుగ్రహం

ఉమ్మెత్త మొక్కను పెంచితే పరమ శివుని అనుగ్రహం

వాస్తు శాస్త్రం ప్రకారం, ఉమ్మెత్త మొక్క శివునికి అత్యంత ఇష్టమైన మొక్క. శివుడికి అత్యంత ఇష్టమైన శ్రావణ మాసంలో ఉమ్మెత్త మొక్క ఇంట్లో నాటితే శుభాలు జరుగుతాయని చెబుతున్నారు. ఉమ్మెత్త మొక్కను నాటడం ద్వారా శివుడి అనుగ్రహం ఉంటుందని చెబుతున్నారు . ఈ మాసంలో ఉమ్మెత్త మొక్కను నాటిన వ్యక్తికి పరమశివుని విశేష ఆశీస్సులు లభిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Vastu Shastra experts say that planting Tulsi, datura, Doob grass, Money plant and jammi five plants in the month of Shravana will bring wonderful benefits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X