vastu tips: తరచూ అనారోగ్యాలతో బాధ పడుతున్నారా? అయితే ఈ వాస్తుచిట్కాలు పాటించి చూడండి!!
తరచూ అనారోగ్యాలతో బాధపడే వారు వైద్యులను సంప్రదించి చికిత్స పొందటం ఎంత అవసరమో, ఇంటి వాస్తుని కూడా సరి చూసుకోవడం అంతే అవసరం. ఒకసారి వాస్తు ప్రభావం కూడా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్యం కలుగుతుంది. అందుకే వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మంచి ఆరోగ్యం కోసం ఇంట్లో కొన్ని వాస్తవమైన చిట్కాలను పాటిస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

వాస్తు దోషాలతో ఆరోగ్యం పై ప్రభావం
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య మూలలో మెట్లు లేదా మరుగుదొడ్లు నిర్మిస్తే, ఆరోగ్య సంబంధమైన సమస్యలు బాధిస్తాయి అని, పిల్లల ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుందని చెబుతున్నారు. పొరపాటున కూడా ఇంటికి ఈశాన్య మూలలో మెట్లు లేదా మరుగుదొడ్లు నిర్మించకూడదు అని సలహా ఇస్తున్నారు. ఇంటికి ఈశాన్య దిశలో రోజు దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటికి ఈశాన్య దిశలో దీపం వెలిగించడం ఆరోగ్యాన్ని ఇస్తుంది అని సూచిస్తున్నారు.

నైరుతీ వీధిపోటుతో తీవ్ర అనారోగ్య సమస్యలు
ఇక ఇంట్లో ఉన్న నీటి కుళాయిల నుండి ఎప్పటికి నీరు కారుతూ ఉంటే ధననష్టం జరగడమే కాకుండా, ఆరోగ్య నష్టం కూడా జరుగుతుందని చెబుతున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇక ఇంటికి నైరుతి దిశలో వీధిపోటు ఉంటే ఇంట్లో ఉండే ఇల్లాలికీ 365 రోజులు జబ్బులు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అసలు వీధిపోటు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వీధిపోటు ఉంటే పరిహారంగా అక్కడ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కానీ, ఆ ప్రాంతం కనిపించకుండా పెద్ద చెట్లను పెంచడం కానీ చేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఈ పనులు చేస్తే ఇంట్లోని వారికి అనారోగ్యం
అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లు కింద ఉన్న స్థలాన్ని టాయిలెట్ ల కోసం కానీ, వంటగది కోసం కానీ ఉపయోగించడం నాడీ మరియు గుండె సంబంధిత జబ్బులు దారితీస్తుందని చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో వంటగదిలో మందులు పెడితే ఇంట్లోని వారికి అనారోగ్యం వస్తుందని చెప్తున్నారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తులసి మొక్క ఉండాలని, తులసిని పూజించడం వల్ల మానసిక ఆరోగ్యం పెరుగుతుందని చెబుతున్నారు. ఇంట్లో తులసి లేకుంటే మానసిక అనారోగ్యం కలుగుతుందని అంటున్నారు.

పడుకునేటప్పుడు జాగ్రత్త ..ఆరోగ్యం కోసం వాస్తు చిట్కాలు పాటించండి
ఇక నైరుతి వైపు ప్రధాన పడకగది ఉండాలని, అలా ఉంటేనే శారీరక, మానసిక స్థిరత్వం ఉంటుందని చెబుతున్నారు. ఈశాన్య దిశలో ఎప్పుడూ పడకగదిని నిర్మించకూడదు అని, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో దక్షిణం వైపు తలపెట్టి నిద్రించాలని, ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించే వారికి విపరీతమైన అనారోగ్య సమస్యలు వస్తాయని, మానసిక ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. మొత్తానికి ఆరోగ్యంగా ఉండాలంటే చిన్నచిన్న వాస్తు చిట్కాలను పాటిస్తే సరిపోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications