Vastu tips: ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టటంలేదా? పడుకునేచోట ఈ వాస్తుదోషాలు లేకుండా చూసుకోండి
ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా? నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే అది వాస్తు దోషం వల్ల కావచ్చు. వాస్తు శాస్త్రంలో నిద్రకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. మనం నిద్రపోయే దిశ, బెడ్ రూమ్ లో ఉండే వస్తువులు ప్రతి ఒక్కటి మన నిద్ర మీద ప్రభావం చూపిస్తాయి.

ఈ దిశలో తలపెట్టి పడుకుంటే నిద్రలేమి
నిద్రపోయే సమయంలో ఎవరైనా ఉత్తరం వైపుగా తల పెట్టి నిద్ర పోతే ఆ వ్యక్తి నిద్రలేమితో బాధపడమే కాదు, ఇన్సోమ్నియా బారిన పడే ప్రమాదముందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉత్తరం దిశలో తల పెట్టి పడుకుంటే తలనొప్పి, చిరాకు, నిద్రభంగం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే మంచం లేదా పరుపును ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచవద్దని సూచిస్తున్నారు. బాగా నిద్ర పోవాలంటే సౌండ్ స్లీప్ కోసం దక్షిణం వైపు తల పెట్టి పడుకోవాలని చెబుతున్నారు.

తలుపుకు ఎదురుగా తలపెట్టినా నిద్రాభంగం
అంతేకాదు మీ తల తలుపుకి ఎదురుగా పెట్టి పడుకుంటే ఆందోళన కలిగించే కలలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. పడుకున్న మంచం పైన అటక కానీ, లేదా భారమైన వస్తువులు గాని ఉంటే ఆ భారమంతా మన తల పైన ఉన్నట్టు అది మన నిద్రను చెడగొడుతుంది అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ప్రశాంతమైన నిద్ర కోసం చదునైన ఉపరితలం ఉండేలా చూసుకోవాలని సూచిస్తుంది. ఇక బెడ్ రూమ్ కు ఆగ్నేయ దిశలో నీళ్ళతో కూడిన పాత్ర ఉండటం వల్ల కూడా నిద్రలేమి కలుగుతుందని చెప్తున్నారు.

అటాచ్డ్ వాష్ రూమ్ తలుపులు తెరచి ఉన్నా నిద్రలేమి
పడకగది కి ఉన్న రంగులు ముదురు రంగులు ఉన్నా అది మన నిద్ర మీద ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ఈశాన్య దిశ ను బరువుగా మరియు స్థూలంగా కాకుండా తేలికగా ఉంచకుంటే కూడా అది మనకు నిద్రాభంగం కలిగిస్తుందని చెప్తున్నారు. ఇక పడమర కిటికీల నుండి నిరంతరం గదిలోకి ప్రవేశించే సూర్యకాంతి నిద్రలేమికి మరొక కారణం. బెడ్‌రూమ్‌లోని వాష్‌రూమ్ తలుపులు తెరిచి ఉంచడం వల్ల ఇది నిద్రకు భంగం కలిగించవచ్చు. అలాగే, మీ నిద్ర ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచకుంటే కూడా ప్రశాంతమైన నిద్ర పట్టదని చెబుతున్నారు.

అద్దంలో పడుకున్న వారి ప్రతిబింబం.. ఆందోళన కలిగించే కలలకు కారణం
ఏవైనా అసహ్యకరమైన దృశ్యాలు లేదా భయానక ఫోటోగ్రాఫ్‌లను బెడ్రూంలో పెట్టుకోవడం వల్ల కూడా వాటి ప్రభావం మన నిద్రపై తప్పనిసరిగా ఉంటుంది. మంచం ఎదురుగా పడుకున్న వారి ప్రతిమ అందులో కనిపించేలా అద్దం ఉంటే కూడా ఇది చెడు కలలు మరియు నిద్రలేమికి దారితీస్తుంది. ఇక భారీ సీలింగ్ లు కూడా నిద్రలేమికి మరో కారణమని తెలుస్తోంది. సిలిండర్, ఫ్రిజ్, గ్యాస్ సిలిండర్ మొదలైన వస్తువులు గదిలో ఉన్న వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోకుండా చేస్తుంది. అదేవిధంగా గదిలో టెలివిజన్ ఉన్నా, రాత్రిపూట ఎక్కువసేపు మొబైల్‌లకు అతుక్కుని ఉన్నా నిద్రలేమికి కారణం కావచ్చు.

ఈశాన్య దిశ లేదా నైరుతి దిశలో స్వల్ప లోపం.. నిద్రకు భంగం
ఈశాన్య లేదా నైరుతి దిశలో స్వల్ప లోపం నిద్రకు భంగం కలిగిస్తుంది. ఒక వ్యక్తిలో నిద్రలేమికి లేదా నిద్రలేమికి దారితీసే ఇతర కారణాలలో వెంటిలేషన్ లేకపోవడం, తెరుచుకునేటప్పుడు లేదా మూసివేసేటప్పుడు డోర్ శబ్దం చేయడం, రాత్రిపూట బెడ్ ల్యాంప్ కలర్ బాగా ఎక్కువగా ఉండటం వంటివి కూడా కారణాలు అవుతాయని తెలుస్తుంది.












Click it and Unblock the Notifications