Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vastu Tips: ఇంట్లో గార్డెనింగ్ కూ వాస్తు.. ఆ దిశలో చెట్లు పెంచితే అన్నీ అరిష్టాలే!!

పురాతన భారతీయ వాస్తు సిద్ధాంతమైన వాస్తు శాస్త్ర నియమాలను అనుసరించడం ద్వారా, జీవితంలో సామరస్యం, శాంతి, శ్రేయస్సు మరియు ఆరోగ్యాన్ని తీసుకురావచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇక మొక్కలు పెంచటం అంటే చాలా మంది ఇష్టాన్ని చూపిస్తారు. ఇంటికి ఆహ్లాదాన్ని ఇచ్చే, పర్యావరణాన్ని కాపాడే మొక్కలను పెంచటంలో కూడా వాస్తు పాటిస్తే ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. గృహ నిర్మాణంతో పాటుగా, ఇంట్లో మొక్కలు పెంచడానికి, గార్డెనింగ్ చేయడానికి కూడా వాస్తు పాటించాల్సిన అవసరం ఉంది.

ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పెద్ద పెద్ద చెట్లతో మూసివెయ్యటం మంచిది కాదు

ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పెద్ద పెద్ద చెట్లతో మూసివెయ్యటం మంచిది కాదు


ఏ దిశలో పడితే ఆ దిశలో పెద్ద పెద్ద చెట్లు పెంచడం ఇంటికి మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీరు మొక్కలు పెంచడం పైన ఆసక్తి చూపిస్తే వాస్తు ఆధారంగా మొక్కలను పెంచితే సానుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద, గేట్లు, ఎంట్రీ పాయింట్స్ వద్ద పెద్ద పెద్ద చెట్లతో కప్పి వేయడం మంచిది కాదు. ద్వారం ఎప్పుడు వీలైనంత విశాలంగా ఉండేలా చూసుకోవాలి. మీరు ప్రవేశ ద్వారం యొక్క ఒక వైపున ఒక చెట్టును కలిగి ఉండవచ్చు.

ప్రవేశ ద్వారానికి ఒకవైపు మాత్రమే పెద్ద చెట్టు ఉండాలి

ప్రవేశ ద్వారానికి ఒకవైపు మాత్రమే పెద్ద చెట్టు ఉండాలి

ప్రవేశ ద్వారానికి ఒకవైపున మాత్రమే మామిడి, వేప లేదా అరటి చెట్టు వంటి చెట్లు ఉంటే మంచిదని వాస్తు శాస్త్రంలో ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంటి ముఖద్వారం విశాలంగా ఉంటే ఆ ఇంట్లో ఉండే వారి ఆలోచనలలో జీవితం పట్ల సరైన స్పష్టత ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఒక చెట్టును నాటడం లేదా ఒక నిర్దిష్ట దిశలో ఒక మొక్కను పెంచడం ద్వారా, దాని సానుకూల ప్రభావాన్ని బలోపేతం చేయవచ్చు. మొక్కలు పెట్టకూడని దిశలలో మొక్కలు నాటినట్లయితే ప్రతికూల ఫలితాలు వస్తాయని కూడా వాస్తుశాస్త్రం చెబుతోంది.

ఈశాన్య దిశలో చెట్లు పెంచటం యమా డేంజర్ .. చెట్లు పెట్టాల్సిన దిశలు ఇవే

ఈశాన్య దిశలో చెట్లు పెంచటం యమా డేంజర్ .. చెట్లు పెట్టాల్సిన దిశలు ఇవే


ముఖ్యంగా ఇంటికి ఈశాన్య దిశలో మొక్కలు ఉండకూడదని, ఈశాన్య దిశలో పెద్ద పెద్ద చెట్లు, మొక్కలు పెట్టడం కుటుంబంలో చిరాకుకు కారణంగా మారుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈశాన్యంలో ఎంత బరువు ఉంటే బ్రతుకు అంత భారంగా మారుతుంది. ఈ దిశలో బరువు మంచిది కాదు. అందుకే ఈశాన్యంలో చెట్లను పెంచరాదని వాస్తు శాస్త్రం చెప్తుంది. ఆ దిశలో చెట్లు పెంచితే అన్నీ అరిష్టాలే అని పేర్కొంది. ఇంటికి ఉత్తరాన కానీ, తూర్పున కానీ చిన్న చిన్న మొక్కలు నాటితే ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటికి పశ్చిమ దిశల్లో కానీ దక్షిణ దిశలో కానీ ఉండేలా మొక్కలు నాటడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంటికి నైరుతి దిశలోనూ పెద్ద పెద్ద చెట్లు ఉండటం లాభం చేకూరుస్తుంది.

ఇంటిపై 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నీడ పడే చెట్లను పెంచరాదు

ఇంటిపై 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నీడ పడే చెట్లను పెంచరాదు


కొబ్బరి చెట్లను నైరుతిలో పెట్టడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య వాటి నీడ ఇంటిపై పడకుండా చెట్లను నాటాలి. మీ ఇంటికి చాలా దగ్గరగా రావి మరియు మర్రి వంటి పెద్ద చెట్లను పెంచడాన్ని నివారించాలని చెప్పబడింది. ఎందుకంటే వాటి మూలాలు పునాది మరియు కాంపౌండ్ వాల్‌ను దెబ్బతీస్తాయి. వాస్తు ప్రకారం తుంచితే ఆకు నుంచి పాలు కారే మొక్కలను ఇళ్లల్లో పెట్టుకోవడం మంచిది కాదని పేర్కొంది. అంతే కాదు చాలా మొక్కలు అదృష్టాన్ని ఇస్తాయని, కొన్ని మొక్కలు ఇళ్ళలో పెట్టుకుంటే దరిద్రం పట్టుకుంటుందని కూడా వాస్తు శాస్త్రం పేర్కొంది. వాటి గురించి కూడా ముందు ముందు సవివరంగా చెప్తాం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+