vastu tips: ఇంట్లో బరువైన వస్తువులు ఎక్కడ పెట్టాలి? వాస్తు ఏం చెప్తుంది?
పొరపాటున కూడా ఈశాన్యంలో ఎటువంటి వస్తువులను పెట్టకూడదు. ఇంట్లో బరువులు పెట్టాలంటే ఆ దిశలోనే పెట్టాలి.
ఇల్లు కట్టుకోవడానికి ఏ విధంగా అయితే వాస్తు అవసరమో అదే విధంగా ఇంట్లో వస్తువులను పెట్టడానికి కూడా వాస్తు శాస్త్ర నిబంధనలను పాటించడం అవసరం. అయితే చాలామంది ఇళ్ళలో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో తెలియక వాస్తు దోషాలకు పాల్పడుతూ ఉంటారు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి.

ఇంట్లో బరువు ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టకూడదు?
అయితే వాస్తు నియమాలను గురించి తెలుసుకోవాలనుకునే వారు ముందు ఇంట్లో బరువు ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టకూడదు? అనే విషయాలను తెలుసుకోవాలి. పొరపాటున కూడా ఈశాన్యంలో ఎటువంటి వస్తువులను పెట్టకూడదు. తూర్పు ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో బరువైన వస్తువులను పెడితే జీవితం అంతే భారంగా ఉంటుంది. ఈశాన్యంలో బరువైన వస్తువులను పెట్టటం వలన అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే గృహ మధ్యంలో, హాల్లో కూడా ఎటువంటి బరువైన వస్తువులను పెట్టకూడదు. చాలా మంది బాగా బరువున్న సోఫాలను, డైనింగ్ టేబుల్స్ ను పెట్టటం మంచిది కాదని చెప్తారు.

బరువు పెట్టాల్సింది అక్కడే
వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు పురుషుడు ఈశాన్యానికి తల, నైరుతి దిశకు కాళ్ళు పెట్టుకున్న భంగిమలో ఉంటాడు. వాస్తు పురుషుడు భంగిమను బట్టి మనం అర్ధం చేసుకోవాల్సింది బరువు శరీరంపై పెట్టకూడదు అని, వాస్తు పురుషుడి కాళ్ళ భాగంలో బరువు పెట్టటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే నైరుతి దిశలోనే బరువు పెట్టాలని అంటున్నారు.

అక్కడ బరువు పెట్టటం వల్ల బోలెడు మంచి ఫలితాలు
ఇంట్లో బరువైన వస్తువులను పెట్టాలి అనుకుంటే కచ్చితంగా నైరుతి దిశలోనే పెట్టాలి. అందులోనూ దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి దిశలలో బరువైన వస్తువులను పెట్టుకోవాలి. ఈ ప్రదేశాలలో ఎంత బరువైన వస్తువులు పెడితే అంత మంచిదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఉత్తరం వైపున కానీ, ఇంటి టెర్రస్ పైన కానీ పొరపాటున కూడా బరువైన వస్తువులను పెట్టకూడదు. అంతేకాదు నైరుతి దిశలో బరువైన వస్తువులను పెట్టడం వల్ల అనేక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. జీవితం సాఫీగా సాగుతుంది. అంతే కాదు నైరుతి దిశలో ఎటువంటి తలుపులను, కిటికీలను పెట్టకూడదు.

ఈశాన్యంలో పొరబాటున కూడా ఈ పని చెయ్యకండి
చాలామంది ఇళ్లల్లో స్టోర్ రూమ్ లలోనూ పాత సామాన్లన్నీ వేసి నింపుతూ ఉంటారు. స్టోర్ రూమ్ లో సైతం ఈశాన్యం వైపు బరువు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈశాన్యంలో తెలిసి తెలియక బరువైన వస్తువులు పెడితే దాని ప్రభావం కచ్చితంగా జీవితం పైన ఉంటుంది. ఈశాన్యం వైపు వస్తువులు మాత్రమే కాదు, పెద్ద పెద్ద చెట్లు కూడా లేకుండా చూసుకోవాలి. ఎంత ఖాళీగా ఉంటే, ఎంత శుభ్రంగా ఉంటే అంత కలిసి వస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
disclaimer: ఈ కథనం వాస్తు నిపుణుల సలహాలు, నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications