• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వృక్ష రక్షణ-ప్రాణ శక్తి: అలసట వచ్చినా, అనారోగ్యమైన ఈ చెట్ల కింద కూర్చుంటే ప్రయోజనం

|

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

కంటికి కనిపించే భౌతిక శరీరంలో రోగం బయట పడకముందే, ఆ వ్యాధిని జీవధాతు శరీరంలో చూడగలమని దివ్యజ్ఞానంతో..... చూడగలిగి నప్పుడే తెలుస్తుంది. అటువంటి దివ్యజ్ఞానం లేనివారు ఆ అనారోగ్యం సోకినా భాగంలో గల లోపలి కాంతిమండలాన్ని 'స్కాన్' చేసి, లేదా గ్రహించి అది సాధారణంగా వుండే పరిణామం కంటే తక్కువగా వుందో, లేక ఎక్కువగా వుందో తెలుసుకోవచ్చు.

ఉదాహరణకు, ఒక వ్యక్తికి దగ్గు, పడిశం వచ్చే ముందే, అతని జీవధాతు శరీరంలోని గొంతు, ఊపిరితిత్తులలో గల ప్రాణశక్తి క్షీణిస్తుంది.

vruksho rakshati rakshitah

దివ్యదృష్టి ద్వారా ఇది బూడిదరంగులో వున్నట్లు చూడగలరు. ఈ ప్రాంతాలను 'స్కాన్' చేసినప్పుడు అక్కడ లోపలి కాంతిమండలంలో గుంటలు పడినట్లుగా గమనించగలరు. This is aura scan.(pranic healing)

ఇంకొక ఉదాహరణ : కామెర్ల వ్యాధి సోకబోయే వ్యక్తి యొక్క సోలార్ ప్లక్లెస్, కాలేయాలు బూడిదరంగులో వున్నట్లు దివ్యజ్ఞానంతో ముందుగానే తెలుసుకోవచ్చు. శారీరక పరీక్షలు, ఆరోగ్య నిర్ధారణ పరీక్షలలో రోగి ఆరోగ్యవంతంగా, మామూలుగానే వున్నట్లు తెలుస్తుంది.

కానీ ఆ రోగికి చికిత్స చేయకపోతే, త్వరలోనే ఈ కామెర్ల వ్యాధి భౌతిక శరీరంలో కన్పించి తీరుతుంది.

మనసును ఆనందకరంగా వుంచుకోగలిగితే తొంభైశాతం శారీరక రుగ్మతలు దూరమైపోతాయని ఋషుల కాలంనాదే రుజువు చేయబడింది.

నిజానికి మనిషి శరీరమే ఒక అనుభవజ్ఞుడైన డాక్టర్. ఏ యంత్రం విరిగిపోయిన, అరిగిపోయిన, తన భాగాలను తనే బాగు చేసుకోలేదు.

కానీ మనిషి శరీరం, జంతు క్రిమికీటకాదుల శరీరాలు, పక్షులు, పచ్చటి చెట్లు, పూలమొక్కలు వాటికవే వాటి జబ్బల్ని నయం చేసుకోగలవు. పీల్చుకునే ప్రాణశక్తి ద్వారా, జీవనాధారా శక్తి ద్వారా తాగే నీటి ద్వారా, తీసుకునే ఆహారం ద్వారా శరీరం తన భాగాన్ని తనే బాగుచేసుకోగలదు.

మనిషి ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ, అతనికి ప్రాణాధార శక్తులు గురించి ఏ మాత్రం తెలియదు. అందుకే తాను అంటే ఈ భౌతిక శరీరమే అన్న భ్రమలో పడిపోయి, తాను కూడా ఒక పదార్ధమేనని నమ్ముతూ వుంటాడు.

మనిషి ఆరోగ్యాన్ని శాసించే పదకొండు ప్రధాన చక్రాలపై పాజిటివ్ గా జీవశక్తిని కేంద్రీకరిస్తే అనారోగ్యం అనేదే వుండదని మన పూర్వీకులు ఎప్పుడో రుజువు చేశారు అలా రుజువు చేసే ఋషులు, దివ్యపురుషులు, అఘోరీలు, నాగా సాంప్రదాయ సాధువులు, నాథ్ సాంప్రదాయ యోగులు...... ఎంతోమంది హిమాలయ పర్వతాలలో ఇప్పటికీ వున్నారు.

వీరు మనిషి శరీరంలో నిక్షిప్తమై వున్న పదకొండు శక్తి చక్రాల్ని ఆజ్ఞాపించటం ద్వారా స్వస్థత చేకూరుస్తారు.

ధ్యానాన్ని చెడు దిశకేసి మరలించే క్షుద్రులు ఈ పదకొండు ప్రాణహిత చక్రాల్నే హింసిస్తూ మనుషుల్ని అనారోగ్యానికి గురిచేస్తారు.

1.మూలాధారచక్రం,

2.స్వాధిష్టాన చక్రం,

3.మెంగ్ మెయిన్,

4.మణిపూరక చక్రం,

5.ప్లీహచక్రం,

6.సోలార్ ప్లక్సెస్,

7.ముందు - హృదయచక్రం,

వెనక హృదయ చక్రం,

8.విశుద్ధ చక్రం,

9.ఆజ్ఞా చక్రం,

10.ఫాలచక్రం,

11.సహస్రార చక్రం.

వీటిని అధీనంలో ఉంచుకునే వ్యక్తి అనారోగ్యానికి గురికావటం జరగదు.

ఎన్నో వందల సంవత్సరాలు జీవించే దేవదారు వృక్షాలు (ఇప్పుడని హిమాలయాలలో మాత్రమే వున్నాయి) ఎంతో ఆరోగ్యకరమైనవిగా గుర్తించబడ్డాయి. ఈ చెట్లు అధికంగా తమలో వున్న ప్రాణశక్తిని చాలా ఎక్కువ పరిమాణంలో బయటకు వెదజల్లుతూ వుంటాయి.

అలసట చెందినవారు, లేదా అనారోగ్యానికి గురయినవారు ఈ చెట్ల కింద విశ్రాంతి తీస్కున్నా, పడుకున్నా ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు.

పూర్వకాలంలో.... ఋషులు. మునీశ్వరులు ఈ తరహా చెట్లకిందే కూర్చుని ధ్యానం చేసుకునేవాళ్ళు.

ఆధ్యాత్మిక సాధకుడికి ప్రాణశక్తిని బయటకి వదిలే ఈ చెట్లే బంధువులు.

వృక్షో రక్షతి రక్షితః!

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Vruksho Rakshati Rakshitaha is a word in the sacred language of India, It means One Who Save Trees is Saved by Trees.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more