సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం

వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్య దేవుడికి విశేషమైన స్థానం ఉంటుంది. సూర్యభగవానుడు అన్ని గ్రహాలకు రాజు కావడంతో, జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నప్పుడు, సూర్య గోచారం కారణంగా విశేషమైన గౌరవం సంపద లభిస్తాయి. సూర్యభగవానుడి రాశి మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం మీనరాశిలో సూర్య గోచారం కారణంగా మే 13 వరకు సూర్యభగవానుడి విశేషమైన ఆశీస్సులు లభిస్తాయి.

మేష రాశి
మేషరాశి వారికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు వస్తాయి. వర్తక వ్యాపారాలలో ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు మీ సోదరులు సోదరీమణుల నుంచి సహాయాన్ని పొందవచ్చు. ఈ సమయంలో సమాజంలో గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. పనిలో విజయం వరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసేపనికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

Wealth for these zodiac signs till May 13th with surya gochar

మిధున రాశి
ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సూర్యభగవానుడు దయవల్ల మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లభిస్తాయి. కొత్త పనిని ప్రారంభించడానికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలాంటి లావాదేవీల కైనా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

సింహరాశి
సింహ రాశి వారి కుటుంబ సంబంధాలలో ఈ సమయంలో మాధుర్యం పెరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు ఉద్యోగాలను పొందుతారు. ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. డబ్బు సంబంధిత విషయాలలో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.

కన్య రాశి
కన్యా రాశి వారి ఆర్థిక సంబంధమైన లావాదేవీలకు ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో కన్యారాశి జాతకుల పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. సూర్య సంచార కాలంలో మీరు విజయాలను సాధిస్తారు. ధన ప్రవాహానికి కొత్త అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+