వారఫలాలు: ఆగస్టు 13 నుంచి 19 వరకు రాశిఫలాలు (మేషం నుంచి కన్య వరకు)

గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచరించే క్రమంలో కొందరికి సానుకూల ఫలితాలు ఎదురైతే మరికొందరికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరికి కలిసొస్తుంది? అంతా సానుకూలమేనా? ఇబ్బందులుంటాయా? ఉంటే ఎలా పరిష్కరించాలి.. తదితర విషయాలను రాశి చక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తారు. మేష రాశి నుంచి కన్యా రాశి వరకు ఈ వారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

మేషరాశి: మనోబలంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. పరిస్థితులకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటుండాలి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. వ్యాపారంలో మాత్రం చిన్న చిన్న ఆటంకాలేర్పడతాయి. మాటతీరు మృదువుగా ఉండాలి. భగవంతుడి నామాన్ని స్మరిస్తుండాలి.

horoscope

వృషభరాశి: వ్యాపారం కలిసివస్తుంది. దేన్నిగురించి లోతుగా ఆలోచించవద్దు. ఉద్యోగం బాగుంటుంది. సంపూర్ణ విజయం సాధిస్తారు. భవిష్యత్తు బాగుంది. నూతన ప్రయత్నాలు ప్రారంభించాలి. ధనయోగం ఉంది.

మిథునరాశి: సకాలంలో పనులు పూర్తిచేయడంవల్ల మేలు చేకూరుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని బాధ్యతగా అమలు చేస్తుండాలి. అంతిమంగా మంచి ఫలితాన్ని సాధిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించాలి. మంచి వార్త చెవినపడుతుంది.

కర్కాటకరాశి: వాక్కు స్థానంలో కుజుడున్నాడు. దీనివల్ల మౌనంగా ఉండటమే మంచిది. తెలివితేటల్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల బంగారు భవిష్యత్తను సాధిస్తారు. ఉద్యోగంలో పనులను సకాలంలో పూర్తిచేస్తుండాలి. సూర్యనారాయణమూర్తిని ధ్యానించాలి.

సింహరాశి: కాలం మిశ్రమంగా ఉంది. మనోబలంతో ముందుకు పయనించాలి. ధైర్యంగా సమస్యలను అధిగమిస్తారు. నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. వివాదాల జోలికెళ్లొద్దు. సకాలంలో పని పూర్తిచేయడంవల్ల ఉద్యోగంలో మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయంతో సమస్యలను పరిష్కరిస్తారు. కుజుడి శ్లోకం పఠించాలి.

కన్యరాశి: ఉద్యోగంలో పనితీరుకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. దయాగుణంతో ఆలోచించాలి. కొన్ని పనుల్లో ఏం చేయాలనే విషయమై స్పష్టత వస్తుంది. సమయస్ఫూర్తి మిమ్మల్ని కాపాడుతుంది. ఏ విషయాన్ని మనసుకు పట్టించుకోవద్దు. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచి జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+