24వ తేదీలోపు ఈ రాశులవారే మహారాజులు

గ్రహాలు నిర్దిష్ట సమయంలో చేసే రాశి సంచారంవల్ల కొన్ని రాశులకు అనుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశులకు ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. ఈనెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రావణ మాసంలో ఈవారం ఏ రాశులకు ఆర్థికంగా, సామాజికంగా కలిసిరాబోతోంది? సానుకూల పరిణామాలతోపాటు ప్రతికూల పరిణామాలు ఎదురైతే ఏం చేయాలి?.. తదితర విషయాలను రాశిచక్రాల ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తారు. రాశులవారీగా వచ్చే ఫలితాలను తెలుసుకుందాం.

మిథునరాశి
ఈ వారం వీరికి బాగుంటుంది. బలహీనతలను అధిగమించాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో అప్రమత్తత అవసరం లేదంటే నష్టపోతారు. వచ్చే మంగళవారం మనకు సంబంధంలేని పనుల్లో అనవసర జోక్యం చేసుకోకుండా ఉండటమే ఉత్తమం. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పనులు మాత్రం చురుగ్గా సాగుతుంటాయి. ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించడం మంచిది.

weekly horoscope results from august 18th to august 24th

కర్కాటక రాశి
వచ్చే సోమవారం నాడు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దు. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. సుబ్రమణ్యస్వామి దేవాలయాన్ని సందర్శించి.. ఆయన్ను ఆరాధించాలి.

కన్యారాశి
పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఖర్చులు మాత్రం అదుపులో ఉండవు. శనివారం రోజు పనులన్నీ స్వయంగా చూసుకోవడమే మంచిది. ప్రయాణాలుంటాయి.. అవి లాభసాటిగా మారతాయి. దైవదర్శనానికి వెళతారు. అన్ని విషయాలు జీవిత భాగస్వామికి చెప్పాలి.

మేషరాశి
సూర్యుడిని ఆరాధించడంతోపాటు ఎదుటివారికి సాయం చేయాలి. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఎటువంటి పనులు అవవు. ధనలాభంతోపాటు కొత్త వస్త్రాలు కూడా వస్తాయి. ఇవ్వవల్సినవాటికి సకాలంలో చెల్లింపులు చేస్తారు. మీరు చేసిన సాయంవల్ల ఒకరికి ఎంతో మంచి జరుగుతుంది.

వృషభ రాశి
పరిచయం లేనివారితో గొడవలకు వెళ్లొద్దు. ఇబ్బందులు తొలగిపోవడంతోపాటు ఆదాయం బాగుంటుంది. ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడంతోపాటు దేవాలయాలను సందర్శిస్తారు. దీనివల్ల అంతా మంచే జరుగుతుంది. బాగా ఆందోళనకు గురిచేసిన సమస్య పరిష్కారమవుతుంది. ఊహించనిరీతిలో కొన్ని సంఘటనలు ఎదురవుతాయి.

సింహ రాశి
ఈ వారం వీరికి మిశ్రమంగా ఉంటుంది. గురువారం, శుక్రవారం పనులు కావు. ఖర్చులు మించిపోతాయి. దైవానికి సంబంధించిన పనుల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆలోచనలు ఎక్కువగా ఉండటంవల్ల మనశ్శాంతిని కోల్పోతారు. అమ్మవారి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తే చాలామంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+