వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్సంగం అంటే ఏమిటి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

మనిషి జీవితం ఎలా శాంతంగా ఉంటుంది? సంతోషం ఎప్పుడు ఎలా కలుగుతుంది? సత్సంగం అంటే ఏమిటి? స్వధర్మం అంటే ఏమిటి? అహంకారాన్ని ఎలా నిర్ములించాలి?

మనిషి స్వధర్మాచరణ చేస్తూ సంతోషంగా, శాంతంగా బ్రతకాలి?

What is Satsang?
మనిషి జీవితం ఎలా శాంతంగా ఉంటుంది?

జీవనానికి నియమాలు, నదులకు చెలియలి కట్టలు
మనస్సుకి సత్సంగ సాధన -
ప్రాణానికి ఆయామం
శరీరానికి వ్యాయామం
బుధ్ధికి ప్రగాడ సూక్ష్మత - ఇవన్నీ ఉంటేనే మనిషి జీవితం శాంతంగా ఉంటుంది.

మనిషికి సంతోషం ఎప్పుడు, ఎలా కలుగుతుంది?

హుషారుగా ,ఇష్టపడి కష్ట పడుట
ఇతరులకు ప్రేమతో సేవ చేయడం
నీ స్వశక్తి పై గానీ తోటి వారిపై గానీ, దేవునిపై గానీ విశ్వాసం ఉంచి
ఎపుడూ నీకు దేనిపై విశ్వాసముందో దానిని ప్రార్ధన చేస్తూ
మన పని విజయవంతం కావటానికి కృషి చేయడం - సంతోషానికి తొలి మెట్టు.

సత్సంగం అంటే ఏమిటి?

ఓ మంచి గురువు, మంచి స్నేహితుడు, మంచి గ్రంధంతో గడపటమే సత్సంగం.
శరీరాన్ని, మనస్సుని, ప్రాణశక్తిని ఒకే కంపనంలో ఉంచడమే యోగానికి తొలి మెట్టు .

మనిషి జీవన విధానం ఎలా ఉండాలి?

మనస్సుని ఉత్సాహంతో నింపుకొని
ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవడం
, మనస్సుని అన్నివేళలా ఆశావహంగా ఉంచుకొని
దుఖాన్ని అధిగమించడం,
ఇతరులు చేసిన తప్పిదాలను క్షమించడం, అన్యాయాలను, అనినీతిని ఎదుర్కోవడం
, కుటుంబం కోసం, సంఘం కోసం పాటుపడటం
వైఫల్యాలు మరిచి నిరంతరం విజయం కోసం ప్రయత్నించడం. ధర్మమేమిటో అవగాహన చేసుకోవడం - ఇదే మనిషి జీవన విధానం.

మనిషి ఏది వదులు కొంటే శాంతంగా ఉంటాడు?

మనిషికి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మానసం, చిత్తం, బుద్ది, అహంకారం, వీటన్నింటినీ ఆవరించి జీవాత్మ ఉంటాయి. శరీరంలో ప్రతి కణానికి మనస్సు ఉంటుంది. కణంలోని ప్రతి అణువుకూ మనస్సు ఉంటుంది. కానీ స్థాయిలోనే తేడా!
మనిషి ఏది సాధిస్తే నిత్యం శాంతంగా, సంతోషంగా ఉంటాడో కనిపెట్టడానికి ఎందరో ప్రవక్తలు, యోగులు, రుషులు మొదలుకొని నేటి శాస్త్రజ్ఞులు వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

అందరూ అంగీకరించిన విషయం ఏమిటంటే, మనిషి నేను -నాది - నా వాళ్లు అనే అహంకార మమకారాలను పూర్తిగా తొలగించుకొంటే ఎపుడూ శాంతిగా ఉండవచ్చును.
అహంకారాన్ని పరమాత్మలో నిమజ్జనం చేయడమే సాధనలో చివరి మెట్టు.

అహంకారాన్ని ఎలా నిర్ములించాలి?
సాధనతో అది ఎలా చేయాలి?
నిన్ను నువ్వు ఇష్టపూర్వకముగా కోల్పోవాలి. ఇలా జరగాలంటే పలు మార్గాలున్నాయి.
మొదటగా - ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవాలి.

మనస్సుని ఏకాగ్రతం చేయటం సాధన చేయాలి. దేని మీద చేయాలి?

శబ్దం లేదా నాదం లేదా మంత్రం మీద చిత్తాన్ని నిలిపేటట్లు సాధన చేయాలి. మంత్ర యోగం
మనస్సుని సంపూర్ణముగా దేవునిపై గానీ, నీకిష్టమైన పనిపైగానీ లేదా నీ స్వశక్తిపై గానీ కేంద్రీకరించి ఎల్లపుడూ స్థిత ప్రజ్ఞత్వంతో ఉండేటట్లుగా సాధన చేయాలి.
-కర్మ ఫల సన్యాస యోగం.

కర్మ సన్యాసం చేసి ప్రతి కార్య కారణానికి దేవునిపై భారమేసి, సుఖ దుఖాలకు చలించక సంపూర్ణ శరణాగతి తో త్యాగ వైరాగ్య జీవనం సాగించడాన్ని-భక్తి యోగం.

అన్ని కర్మలూ నిమిత్త మాత్రము గా ఎలాంటి అనుభూతిలేకుండా చేస్తూప్రేమ తో కూడిన సేవ ఇష్టపూర్వకముగా చేయడాన్ని -రాజయోగం.

శరీరాన్ని సంరక్షించుకొంటూ, మనస్సుని "నేనెవరు" అనేదానిపై విచారణ చేస్తూ విహిత కర్మాచరణ చేస్తూ, త్యాగ బుద్దితో జీవనం -జ్ఞానయోగం.

పైన చెప్పిన విధంగా చేస్తే మనిషికి నిత్య సంతోషం, శాంతి, ఆనందం కలుగుతాయి. అదే మోక్షం. అదే నిర్వాణం. ఇది మనం బతికున్నప్పుడే కలిగే అనుభూతి. ఇలాంటి ఆనందకరమైన జీవితం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు.
అంటే మన మనస్సుని రీ ప్రొగ్రాం చేసుకొవడమన్న మాట. ఏమని? సుఖశాంతులకు బయటి ప్రపంచంపై ఆధార పడనక్కరలేదు, మన మనస్సే వీటికి మూలం, కాబట్టి మనస్సుని మౌల్డ్ చేసుకొంటే చాలు, నిత్యం శాంతంగా ఉండవచ్చు.

మనిషి కనీస అవసరాలు తీర్చుకొంటూ విద్య వినయాలతో డాంబికాలు, దంభాలు లేకుండా కనీసపు వ్రుత్తి ఉద్యోగ, కుటుంబ మరియు సంఘ ధర్మాన్ని ఆచరిస్తూ జీవనం చేయాలి. కోరికలను తన ఆరోగ్యానికి, ఇతరులకు ఇబ్బంది రానంతవరకు తీర్చుకోవచ్చు. ఆశ ఉండాలి. అత్యాశ ,దురాశ ఉండకూడదు. పట్టుదల ఉండాలి. మొండితనం కూడదు. అన్యాయ అధర్మాలను ప్రతిఘటించే కోపం,ఆవేశం, ఆలోచన ఉండాలి. తన ఆరోగ్యాన్ని, ఇతరులను నాశనం చేసే క్రోధం, చింత ఉండరాదు .

అన్ని ప్రాణులపై సమధర్మం ఉండాలి. ఏమి చేస్తే నువ్వు బాధ పడతావో, వాటిని ఇతర ప్రాణులకు చేయకపోవటమే అహింస. స్వధర్మం అంటే ఏమిటి?

జీవితం పైనా, తోటివారి శాంతిపైనా ఉత్సాహం
శత్రువులను కూడ క్షమించే గుణం
తనకున్నంతలో ఇష్టపడి చేసే సేవ
ఇతర ప్రాణులను ఆనందముగా ఉంచే ప్రేమ
ఎన్ని వైఫల్యాలు ఎదురైనా చలించని ఓర్పు
తనపైనా, ప్రతి ప్రాణి పైనా శ్రద్ద - ఈ లక్షణాలతో జీవించడమే మనిషి కనీసపు స్వధర్మం. నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించుశాంతి ఆనందాలు అవే వస్తాయి.

జన్మ రాహిత్యం, సారూప్య, సాలోక, సాయుజ్య మోక్షం, నిరాకార నిర్గుణ పరమాత్మ సన్నిధి చేరే సమాధి స్థితి, - ఇవన్నీ ఎవరికివారు అనుభూతించవలసిన అధి భౌతిక అధి ఆత్మిక విషయాలు.

తెలుసుకో తగినది, తెలుసుకొనేవాడు, తెలుసుకొన్న విషయం - ఇవన్నీ ఏకమైన సమయంలో అంతా శూన్యమే! ఆ శూన్యం ఇలా ఉంటుందని, అలా ఉంటుందని వివరించే స్మ్రుతులు, శ్రుతులు, గీతాసారాలు, మరెందరో ప్రవక్తలు నుడివిన సిద్దాంతాలు మనకెన్నో ఉన్నాయి. వాటిని మార్గం చూపించే మైలు రాళ్ళుగా, దీప జ్ఞాన కాంతులుగా స్వీకరిద్దాం.

English summary
What is Satsang? Definition of Satsang in Nondual Traditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X