వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాస్తు దోషాలకు పరిహారాలు ఏంటి..? ఏ దిశలో వెలుతురుండాలి.. ప్రధాన గుమ్మంకు ఏం చేయాలి..!

|
Google Oneindia TeluguNews


వాస్తుదోషాలకు కొన్ని పరిహారాలు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

సనాతన సాంప్రదాయలకు పుట్టినిల్లు మన భారతదేశం. పలు శాస్త్రలలో వాస్తు శాస్త్రానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం వలన ఎలాంటి దోషాలు, సమస్యలు ఉండవని శాస్త్రం తెలియజేస్తుంది. వాస్తు దోషముంటే అందుకు తగిన పరిహారాలను కూడా శాస్త్రంలో సూచించ బడినది. వాస్తుదోషాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉంటాయి. ఇంట్లో వాస్తుదోషాలు ఉంటే వాటికి తగిన పరిహారాల కోసం ఇప్పుడు తెలుసుకుందాం.

 ప్రధాన గుమ్మంపై దేవుని పటములు ఉంచరాదు

ప్రధాన గుమ్మంపై దేవుని పటములు ఉంచరాదు

​ఇంటి ముఖం ద్వారం ప్రధాన గుమ్మంపై బయట వైపు కనబడే దర్వాజా ఫ్రేం పైన ఎలాంటి దేవుని పటములు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గుమ్మం లోపలివైపు గోమాత సమేత ఐశ్వర్యకాళీ అమ్మవారు పాదాలు, వెంకటేశ్వర స్వామి , గోమాత పటములు ఉండవచ్చును. బయట వైపు ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు, ఓంకారం, కలశం లాంటి గుర్తులు ఉండవచ్చును. ఇలా చేయడం ద్వారా వాస్తు లోపం తొలుగుతుంది. అలాగే ఇంటి ప్రవేశ ద్వారా వద్ద సూర్యాస్తమయం సమయంలో క్రమం తప్పకుండా దీపాలను వెలిగించడం మర్చిపోవద్దు. వాస్తు దోషాన్ని తొలగించడానికి చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్ని వాడాలి, లోహపు ద్వారాలు అనుకూలం కాదు.

 ప్రతి రోజు ప్రధాన గుమ్మానికి ఏం చేయాలి..?

ప్రతి రోజు ప్రధాన గుమ్మానికి ఏం చేయాలి..?

ప్రతి రోజు హిందు సాంప్రదాయం ప్రకారం ముఖ్యంగా ఇంటి ప్రధాన గుమ్మానికి ఉన్న గుమ్మాని పసుపుతో అలంకరించి బియ్యం పిండితో గుమ్మాలకు ముగ్గులు వేసి పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి వాకిట్లో కల్లాపి ప్రతిరోజూ చల్లి ముగ్గు వేయాలి. ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో పగిలిన, విరిగిన వస్తువులు ఉండకూడదు. పక్కబట్టలు వారానికి ఒక సారి ఉతుకాలి. కర్టేన్స్, సోఫా కవర్స్, పిల్లో కవర్స్ మొదలగునవి కనీసం రెండు వారాలకు ఒక సారి క్లిన్ చేసుకోవాలి. ఇంట్లో పనికిరాని ఉపయోగం లేని వస్తువులను ఉంచుకోకూడదు.

 నెలకు ఒక్కసారైనా బూజు తీసుకోవాలి

నెలకు ఒక్కసారైనా బూజు తీసుకోవాలి

పాత న్యూస్ పేపర్లు, కాళి సీసాలు, డబ్బాలు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. ఇళ్లును కనీసం వారానికి ఒక్క సారైనా బకేట్ నీళ్ళలో కల్లుప్పు ( దొడ్డుప్పు ) కొంచం డెటాల్ వేసి ఇళ్లును శుభ్రపరచుకోవాలి. కనీసం వారానికి మూడు సార్లు ఆది, మంగళ, గురు, శుక్ర వారాలలో సాయం సమయంలో ఇంట్లో దూపం వేయాలి. బాత్రూముల గాలి, వెలుతురు సమృద్దిగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. రోజూ బాత్ రూములను సర్ఫు, డెటాల్ లేదా ఫినాయిల్ వేసి శుభ్రపరచుకోవాలి, ఇంట్లో ఉన్న అన్ని దర్వాజలను, కిటికీలను రోజులో కొన్ని గంటలు అన్ని తెరచి విస్తారంగా గాలి ఆడేలా చూసుకోవాలి. తరచూ అన్ని కిటికీలు, ద్వారాలు మూసి ఇంట్లో సరిగ్గా తాజా గాలి ఆడకుండా చేయకూడదు. కనీసం నెలకు ఒక్కసారైనా ఇంట్లో బూజు తీసుకోవాలి. ఇళ్లును దుమ్ము దూళి

 ఈ దిశలో వెలుతురు ఉండాలి

ఈ దిశలో వెలుతురు ఉండాలి

వాస్తుశాస్త్రం ప్రకారం సాయంత్రం వేళలో వాయువ్య దిశలో వెలుతురు ఉండాలి. ఈ సమయంలో చీకటి ఉన్నట్లయితే ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది. వాయువ్య దిశ ఉత్తరం, పడమర దిశ మధ్య ఉంటుంది. కాబట్టి ఈ దిశ ప్రధాన అంశం గాలి. అందువల్ల సంధ్యా సమయంలో ఇక్కడ లైట్లు వెలిగించాలి. అలాగే ఎండిన చెట్లు లేదా మొక్కలను ఇంట్లో, బాల్కనీలో ఎప్పుడూ ఉంచకూడదు. ఇంటిని ఆకుపచ్చ చెట్లతో అలంకరించండి. పచ్చదనం ఇంటికి ఆనందం, శ్రేయస్సును తీసుకొస్తుంది.

 ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లయితే...

ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లయితే...

ఇంట్లో ఏ ప్రదేశంలోనైనా వాస్తు దోషం ఉన్నట్లయితే అక్కడ ఎలాంటి విచ్ఛిన్నం లేకుండా లోపం తొలగించడం సాధ్యం కాదు. కాబట్టి ఈశాన్య దిశలో రాగి చెంబులో నీటిని నింపి బియ్యం పిండితో ముగ్గువేసి ఒక ఆకు గాని ప్లేట్ గాని పెట్టి దానిపైనీళ్ళను నింపిన పాత్రలో చిటికెడు పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరం వేసి ఒక ఎర్రని లేదా పచ్చని రంగు కలిగిన పువ్వును వేసి ఈ శాన్యం మూలలో పెట్టాలి. ఇలా రోజు చేస్తే ఇంట్లో ప్రబలంగా ఉన్న అన్ని దుష్ప్రభావాలను కొంత వరకు తొలగిస్తుంది. వ్యర్థాలను ఇంటి పైకప్పుపై ఉంచకూడదు. లేకపోతే జీవితంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా వాస్తులోపాన్ని తొలగించుకోవచ్చు.

ముఖ్యంగా మనం నివసిస్తున్న ఇల్లును వాస్తురీత్య ఉన్నదా ? మన పేరు బలంతో ప్రధాన ద్వారం సరిపడుతున్నదా ? అనే విషయంలో అనుభవజ్ఞులైన వాస్తు శాస్త్ర పండితులచే నిర్ధారణ చేయించుకోవాలి. వాస్తు అనే అంశంలో ఫోన్లలో కానీ పేపర్లో వేసిన ప్లాన్ చూస్తే దాని ద్వార సమస్య నిర్ధారణ కాదు. వాస్తు అనేది ప్రత్యేకంగా అక్కడ స్థలంకు వెళ్లి పలు అంశాలు చూసి నిర్దారణ చేయాల్సి ఉంటుంది. ఇది గమనించాలి.

English summary
India is the birthplace of orthodox traditions. Vastu is also of great importance in many sciences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X