వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురువున్నవాడు భాగ్యశాలి గురువే గురి..!!

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గురుబ్రహ్మ: గురువిష్ణు:
గురుదేవో: మహేశ్వర:
గురుసాక్షాత్‌ పరబ్రహ్మ:
తస్మైశ్రీ గురవే నమ:

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలసిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ సమస్త గురువుల పాద పద్మములకు ఈ అక్షర కుసుమాల మాల అంకితం

* మనసును గురువు చుట్టూ తిప్పితే, తలతిరిగే మత్తు శరీరానికి ఎక్కుతుంది. ఆమత్తులో కలిమాయ చిత్తవుతుంది. ఇది గురువు మాత్రమే చెయ్యగల గమ్మత్తు.

* ఒక్క సూర్యుడు వెయ్యి కడవల్లో గల నీటిలో దర్శనమిచ్చినట్లు, ఒక్క గురువు వేల మంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనిమిస్తాడు. సూర్యుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తాడు, గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తాడు.

Who is called a guru according to Hindu Mythology-Know here

* గురువు చూపుయే ఉపదేశం.
గురువు జీవితమే ఓ సందేశం.
గురువు పలుకులే ఉపనిషత్తుల సారాంశం.
గురువు స్పర్శయే ముక్కోటి దేవతల ఆశీర్వాద ఫలం.
శిష్యుడి జీవితం ఓ వాహనం,
గురు కృప అందులోని ఇంధనం.

* మాంస నేత్రాలతో చూసేవాళ్లకు గురువు ఓ శరీరం.
మనో నేత్రంతో చూసేవాళ్లకు గురువు పరబ్రహ్మం యొక్క సాకారం.
గురువు సర్వజ్ఞుడు.
గురువు దైవజ్ఞుడు.

* మూర్తీభవించిన పరంజ్యోతి యొక్క కరుణయే గురువు.
గుండెల్లో గురువు ఉంటే, జీవితంలో కరువు ఉండదు.
గురువు యొక్క చూపు, శిష్యుడి జీవితనౌకకు బలమైన చుక్కాని.
గరువు యొక్క మనసు, మమతానురాగాల మాగాణి.

* సంకెళ్లతో బంధియైన శిష్యుని జీవాత్మకు ముక్తిని ప్రసాదించగలిగే ఏకైక శక్తిశాలి గురువొక్కడే. అగమ్యగోచరంగా సాగుతున్న కోట్ల జన్మల ప్రయాసకు ముగింపు చేప్పే ఏకైక దిక్సూచి గురువొక్కడే.

* గురువు నిండు మేఘమై వర్షించగలడు.
గురువు చల్లటి చినుకై స్పృశించగలడు.
గురువు తేజోవంతమైన విత్తనమై నాటుకోగలడు.
గురువు మహావృక్షమై నీడనీయగలడు.
గురువు కమ్మటి మెతుకై ఆకలి తీర్చగలడు.

* కాలికి గ్రుచ్చిన ముల్లును తీయుటకు వజ్రాయుధాన్ని ఉపయోగించటం ఎంతటి అజ్ఞానమో,
బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేయగల గురువును తృచ్ఛమైన కోరికలు కోరడం అంతటి అజ్ఞానమే.

* గురువు శరీరంతో కనిపించగలడు, కాంతి పుంజముల అఖండ ధారగా అనంతాన్ని ఆవరించగలడు.
సమస్త గ్రహములు ఉపగ్రహములతో నిండిన కక్ష్యలు గురువు మెడలో రుద్రాక్ష మాలలు.
సమస్త నక్షత్ర మండలాల సమూహంతో నిండిన అంతరిక్ష తళాలు గురువు కిరీటంలో గల వజ్రాల పలకలు.

* గురువున్నవాడు భాగ్యవంతుడు.
గురువున్నవాడు ఐశ్వర్యవంతుడు.
గురువున్నవాడు అదృష్టవంతుడు.

English summary
The incarnations of Brahma,Vishnu and Maheshwara together makes a guru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X