బృహస్పతి దయతో ఈ సంవత్సరం ఈ రాశులవారు కుబేరులవుతారు
నేడు వృషభరాశిలో బృహస్పతి సంచారం వల్ల అత్యంత శుభకరమైన యోగం కుబేర యోగం ఏర్పడింది. కుబేర యోగం కారణంగా మాత్రమే కాదు, సంవత్సరమంతా వారి జాతకాలలో బృహస్పతి బలంగా ఉన్న కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది. వారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. కుబేరుడు దయతో వారికి సిరిసంపదలు కలుగుతాయి.
2025 వరకు ఈ రాశులకు ధనలాభం
జ్యోతిష శాస్త్రం ప్రకారం బృహస్పతి బలమైన స్థానంలో ఉన్న జాతకులు ఈ సమయంలో బాగా లబ్ధిని పొందుతారు. కుబేర యోగం కారణంగా ఈ సంవత్సరం అంతా అదృష్టవంతులుగా మారుతున్న జాతకులు ఎవరు అన్నది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. బృహస్పతి సంచారం కారణంగా సంవత్సరం వరకు ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఆ రాశుల వివరాల్లోకి వెళితే..

వృషభ రాశి
వృషభ రాశిలోకి బృహస్పతి రావడం, బృహస్పతి బలమైన స్థానంలో ఉండడం వల్ల వృషభ రాశి జాతకుల ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పు వస్తుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. భౌతిక ఆనందం పెరుగుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. శారీరక, మానసిక సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలతో, సంపదలతో జీవిస్తారు. ఉద్యోగాలు చేసేవారు కార్యాలయంలో ఎదుర్కొనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.
సింహ రాశి
వృషభ రాశిలోకి బృహస్పతి ప్రవేశించడంతో, బృహస్పతి బలమైన స్థానం కారణంగా సింహరాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు కనిపిస్తాయి. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. కెరీర్ లోను మంచి మార్పులతో, జీవితం చాలా సంతోషదాయకంగా ఉంటుంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది.
కన్యారాశి
కుబేర యోగం కారణంగా కన్యారాశి జాతకులకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. సంపత్తి తో పాటు సంతోషం కూడా ఉండడంతో ఈ సమయంలో వీరి ఆనందానికి అవధులు ఉండవు. వ్యాపారంలో మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు. ఈ సమయంలో వీరు డబ్బుకు సంబంధించిన సమస్యలను అధిగమిస్తారు. సంపద వచ్చి పడుతుంది. ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. కుటుంబం కోసం సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. ఫలితంగా వ్యక్తిగత సంబంధాలు కూడా బలపడతాయి. వ్యాపార విస్తరణకు కూడా అవకాశాలుంటాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications