సింహరాశిలో భానుడు.. 30 రోజులు ఈ రాశులకు అఖండ ధనయోగం
సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడానికి దాదాపు నెలరోజుల సమయం తీసుకుంటాడు. తన సొంత రాశిలోకి రావడానికి ఏడాది సమయం పడుతుంది. ఈరోజు తన సొంత రాశి సింహరాశిలోకి ప్రవేశించాడు. జాతకంలో ఆయన శుభస్థానంలో ఉంటే కొన్ని రాశులకు విపరీతమైన మేలు కలుగుతుంది. సింహరాశిలో ప్రస్తుతం బుధుడితోపాటు శుక్రుడు కూడా సంచారం చేస్తున్నాడు. వీరికి సూర్యుడు కూడా తోడవడంతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీని తర్వాత లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. ఈ రెండు యోగాలవల్ల లాభపడపోయే రాశుల వివరాలు తెలుసుకుందాం.
తులారాశి
కొత్త ఆదాయ వనరులు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య కొనసాగుతున్న విభేదాలకు ఈ సమయంలోనే స్వస్తి పలుకుతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. ప్రస్తుతం వ్యాపారంలో ఉన్నవారు ఇతర ప్రాంతాలకు దాన్ని విస్తరిస్తారు.

మిథున రాశి
గొప్ప గొప్ప పనులు తలపెట్టి విజయాలు సాధిస్తారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సూర్యుడి అనుగ్రహం లభించి లాభాలు పొందుతారు. చేస్తున్న పనిపై అందరి నుంచి ప్రశంసలు అందుకోవడంతోపాటు సమాజంలో గౌరవం పొందుతారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు శక్తి సామర్థ్యాలను సమకూర్చుకుంటారు.
మేష రాశి
పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారికి బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకుంటున్నవారు ఆశించిన రీతిలో విజయాన్ని అందుకుంటారు. వ్యాపారస్తులకు ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారి సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతతో అన్ని పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు.
సింహరాశి
బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలిస్తుంది. రెండు రాజయోగాల వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. పదోన్నతి ఉంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉండటంవల్ల వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారు శృంగార భరితమైన జీవితాన్ని గడుపుతారు.












Click it and Unblock the Notifications