
health tips: జింజర్ ఎసెన్షియల్ ఆయిల్... ఎన్ని అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తుందో తెలుసా!!
అల్లం ఆయిల్.. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. మనం ఆరోగ్యం కోసం నిజ జీవితంలో అనేక వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి వాటిలో అల్లం ఆయిల్ కూడా ఒకటి. అల్లం ఎన్నో ఔషద గుణాలను కలిగిన పదార్ధం. ఇక అల్లం ఆయిల్ ను జింజర్ ఎసెన్సియల్ ఆయిల్ అని పిలుస్తారు. ఈ ఆయిల్ తో బరువు తగ్గించడంతో పాటు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని తెలుస్తుంది.

జింజర్ ఎసెన్షియల్ ఆయిల్ తో జీర్ణ క్రియ మెరుగుదల
మన ఆరోగ్యం కోసం ఈ జింజర్ ఎసెన్షియల్ ఆయిల్ ను ఏ విధంగా ఉపయోగించవచ్చు. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి వంటి అనేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. జింజర్ ఎసెన్షియల్ ఆయిల్ తో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు నొప్పి, అజీర్ణం సమస్యలు ఉన్నవారు ఈ ఆయిల్ ను తీసుకోవడం వల్ల వాటి నుండి బయట పడతారు. ఇక విరోచనాల సమస్యకు కూడా ఈ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

బరువు తగ్గాలనుకునేవారరికి జింజర్ ఎసెన్షియల్ ఆయిల్ ఎంతో ఉపయోగం
బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతారు . ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు లేదా మూడు చుక్కల అల్లం నూనె వేసుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, అదనపు కొవ్వు తగ్గి బరువు తగ్గుతారని చెబుతున్నారు. అంతేకాదు రాత్రి సమయంలో నిద్రకు ముందు బొడ్లో 4 చుక్కల అల్లం ఆయిల్ వేసుకుని పడుకుంటే కూడా మంచి ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు.

జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఇన్ఫెక్షన్ ఏదైనా ప్రభావం చూపే జింజర్ ఆయిల్
ఇక జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ వాపు వంటి సమస్యలతో ఉన్న వారు ఒక గిన్నెలో బాగా వేడి నీటిని తీసుకొని, అందులో నాలుగైదు చుక్కల అల్లం నూనెను వేసి ఆవిరి పట్టాలి. ఆవిధంగా ఆవిరి పట్టడం వల్ల శ్వాసకోశ సమస్య నుండి ఉపశమనం దొరుకుతుంది. ఇక బాగా తలనొప్పి ఉంటే తలకు ఈ ఆయిల్ రాసుకున్నా ఫలితం ఉంటుందని అంటున్నారు. జలుబుతో ఇబ్బంది పడుతున్న వారు ఈ ఆయిల్ వాసన చూసినా మంచిదని చెప్తున్నారు.

యాంటి సెప్టిక్ గానూ కీలకంగా జింజర్ ఆయిల్
ఇక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, పేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్ల వంటి చెడు ప్రభావాలను ఎదుర్కోవడంలో జింజర్ ఎసెన్షియల్ ఆయిల్ కీలకంగా పనిచేస్తుంది. జింజర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేక వ్యాధులు నయం చేయడంతోపాటు, యాంటీసెప్టిక్ గా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మూడు చుక్కలు అల్లం నూనె కలిపి సేవిస్తే జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణ సంబంధమైన అనేక వ్యాధులు తగ్గుతాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
health
tips:
డయాబెటిస్
కట్టడికి
సింపుల్
ఇంటి
చిట్కాలు..
కానీ
చెయ్యాల్సింది
ఇదే!!