వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: డయాబెటిస్ కట్టడికి సింపుల్ ఇంటి చిట్కాలు.. కానీ చెయ్యాల్సింది ఇదే!!

|
Google Oneindia TeluguNews

మధుమేహం.. ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. మన జీవన శైలి విధానాలతో మధుమేహ సమస్య ఇప్పుడు అత్యంత తీవ్రంగా పరిణమించింది. వందలో ఎనభై మంది మధుమేహం బారిన పడుతున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మధుమేహం కారణంగా శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ ను కంట్రోల్ లో పెట్టుకోకపోతే అది మన జీవితాన్ని దుర్భరం చేస్తుంది. శరీరంలోని అనేక అవయవాలపై డయాబెటిస్ దాడి చేస్తుంది. ఇక డయాబెటిస్ వచ్చిన తర్వాత దానిని అదుపులో పెట్టుకోవడం కోసం జీవనశైలి మార్చుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇక ఇదే సమయంలో డయాబెటిస్ ను కట్టడి చేయడానికి వైద్యులను సంప్రదించి మందులను కూడా వాడాల్సి ఉంటుంది.

ఇంటి చిట్కాలతో డయాబెటిస్ కట్టడి

ఇంటి చిట్కాలతో డయాబెటిస్ కట్టడి

అయితే మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించే అలోపతి మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలామంది ఆందోళన పడుతుంటారు. అలోపతి మందులతో కాకుండా మధుమేహాన్ని ఏవిధంగా కంట్రోల్ చేయవచ్చు అన్నదానిపై తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో ఎక్కువమంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆయుర్వేదం వైపు మొగ్గుచూపుతున్నారు. ఆయుర్వేద మందులతో, ఇంట్లోనే ఉండే ఔషధ గుణాలు ఉన్న పదార్థాలతో ఏవిధంగా డయాబెటిస్ ను కంట్రోల్ లోకి తెచ్చుకోవచ్చు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చేదు మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. మెంతులను తినండి

చేదు మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. మెంతులను తినండి

మన ఇంట్లోనే ఉండే పదార్థాలతో మధుమేహాన్ని తగ్గించుకోవడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు చేదు పదార్థాలను ఎంత తింటే అంత మంచిదని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇక ఇంట్లోనే ఉండే మెంతులు మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. నిత్యం ఒక పరిమితిలో మెంతులను మన ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మధుమేహం కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు. రాత్రి సమయంలో మెంతులను నానబెట్టి, ఉదయం ఆ నీళ్లను తాగి, ఆ నానిన మెంతులను తింటే కూడా మధుమేహం కంట్రోల్ లో ఉంటుందని సూచిస్తున్నారు.

కరివేపాకు, వేపాకు తినండి

కరివేపాకు, వేపాకు తినండి

ఇక ఇంటి దగ్గర దొరికే మరొక పదార్థం కరివేపాకు. కరివేపాకులో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు ఉంటాయని చెబుతున్నారు. అందుకే కరివేపాకును ప్రతిరోజు 2 రెమ్మలు తుంచుకుని తింటే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు వేపాకు కూడా షుగర్ ను కంట్రోల్ చేయడంలో కీలకంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ప్రతిరోజు రెండు వేపాకులు తింటే కూడా మధుమేహం కంట్రోల్ లోకి వస్తుంది అని సూచిస్తున్నారు.

కాకరకాయ రసం షుగర్ ను కంట్రోల్ చేస్తుంది

కాకరకాయ రసం షుగర్ ను కంట్రోల్ చేస్తుంది


ఇక మధుమేహ బాధితులు మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం కాకరకాయ రసాన్ని తాగడం ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతున్నారు. పచ్చి కాకర కాయలు తిన్నా, కాకరకాయ రసాన్ని తాగిన రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయని చెబుతున్నారు. ప్రతిరోజు మనకు అందుబాటులో ఉండే, ఎప్పటికీ దొరికే చిన్న చిన్న పదార్థాలతోనే మధుమేహాన్ని కట్టడి చేయవచ్చని సూచిస్తున్నారు. అయితే ఏ మందులు వాడినా, ఏ ఇంటి చిట్కాలు ఫాలో అయినా షరతులు వర్తిస్తాయని చెప్తున్నారు. అన్నిటికంటే ముందుగా మధుమేహ వ్యాధిగ్రస్తులు అర్థం చేసుకోవాల్సింది జీవన విధానం మార్పు, ఆహార నియమాలు అని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎడా పెడా ఏది పడితే అది, ఎంత పడితే అంత తినటం మానుకోవాలని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: మెడిసిన్స్ వేసుకుంటున్నారా? అయితే ఈ పదార్ధాలు అసలు తీసుకోవద్దు..వెరీ డేంజర్!!

English summary
It is said that home remedies like fenugreek, bitter gourds, curry leaves and neem leaves are very useful for diabetes prevention. Apart from this, it is said that conditions like dietary rules and lifestyle changes are applicable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X