ఏపీలో ఆ ఉద్యోగులకు 9, 23న పెయిడ్ హాలిడేలు..! రీజన్ ఇదే..!

ఏపీలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల ఉద్యోగుల (employees)కు ఈ నెల 9న లేదా ఈ నెల 23న వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తూ ప్రభుత్వం (ap govt)కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలలో తమ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వీరికి ఈ పెయిడ్ హాలిడేలు మంజూరు చేసింది. అయితే ఏయే రాష్ట్రాల ఉద్యోగులకు ఇలా ఏయే రోజు పెయిడ్ హాలిడేగా నిర్దారించారో ఓసారి చూద్దాం.

ఏపీకి పొరుగున ఉన్న తమిళనాడులో ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఉద్యోగులుగా పనిచేస్తున్న తమిళనాడు ఓటర్లకు ఈ రోజు పెయిడ్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈ నెల 9న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో యానాం, తూర్పుగోదావరిలో పనిచేస్తున్న పుదుచ్చేరి స్ధానికులైన ఉద్యోగులకు ఇలా పెయిడ్ హాలిడే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల తేదీ ఆధారంగా ఈ పెయిడ్ హాలిడే వారికి వర్తించనుంది.

AP Govt Mandates Paid Holiday for Tamil Nadu and Puducherry Voter Employees on April 23rd and 9th

ఎన్నికలు జరిగే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ ఓటర్లతో పాటు ఉద్యోగులకు సైతం ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తుంది. అది వారి స్వరాష్ట్రంలో అయినా, లేక బయటికి రాష్ట్రాల్లో ఉన్న వారు అయినా. కాబట్టి తమ సొంత రాష్ట్రంలో ఉద్యోగులతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్న ఓటర్లకు సైతం ఇది వర్తిస్తుంది. దీన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెయిడ్ హాలిడేగా ప్రకటించి వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరిగా అమలు చేయాల్సిన రూల్ కావడంతో ప్రభుత్వాలు ఇలా పెయిడ్ హాలిడేలు ప్రకటిస్తుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+