ఉగాది వేళ.. వేణు స్వామి జోస్యం నిజమైందా?

Venu Swamy: భారత్‌కు పొరుగునే ఉన్న మయన్మార్, థాయ్‌లాండ్‌లల్లో సంభవించిన భూకంపం మిగిల్చిన ప్రాణ, ఆస్తినష్టం అంతా ఇంతా కాదు. నిమిషాల వ్యవధిలో సంభవించిన పెను భూకంపాలు ఈ రెండు దేశాలను కుదిపిపడేశాయి. కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి.

ఈ ప్రకృతి విపత్తు బారిన పడి 150 మంది వరకు దుర్మరణం పాలయ్యారు. అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. పలువురు వాటి శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భవనాల శిథిలాలను తొలగిస్తోన్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చు.

Myanmar and Thailand earthquake 2025 Did Venu Swamy s predictions come true

అదే సమయంలో- పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఇప్పటివరకు దీనివల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియరాలేదు. దీని తీవ్రత అటు పాకిస్తాన్‌, తజకిస్తాన్‌లోనూ కనిపించింది. ఆఫ్ఘనిస్తాన్ సహా మూడు దేశాల్లో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.

ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన తాజా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా రికార్డయింది. ఈ తెల్లవారు జామున సరిగ్గా 5:16 నిమిషాలకు భూమి కంపించింది. రాజధాని కాబుల్‌కు ఈశాన్య దిశగా ఉన్న టఖర్ ప్రావిన్స్‌లోని యెమెన్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు సెస్మాలజీ సెంటర్ తెలిపింది. ఉపరితలం నుంచి 180 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ పేర్కొంది.

కాగా- ఈ ప్రకృతి విపత్తులు చుట్టుముట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి తెరమీదికి వచ్చారు. ఓ వీడియోను విడుదల చేశారు. ప్రత్యేకించి- మయన్మార్, థాయ్‌లాండ్ భూకంపాలను ప్రస్తావించారు. ఈ పెను విపత్తులు సంభవించడం ఖాయమంటూ గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.

విశ్వావసు ఉగాది నామ సంవత్సరం ఆరంభానికి ముందే అంటే ఏప్రిల్- మే నెలల్లో ప్రకృతి విపత్తుల తీవ్రత అధికంగా ఉంటుందంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన క్లిప్‌ను ఆయన ప్రదర్శించారు. 2025 ఏప్రిల్ లేదా మే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట భారీ భూకంపాన్ని చూసే అవకాశం ఉందని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

రిక్టర్ స్కేల్‌పై 6కు పైగా తీవ్రతతో ఈ భూకంపాలు సంభవించవచ్చని జోస్యం చెప్పారాయన అప్పట్లో. ప్రధానంగా M (మయన్మార్) లేదా, T (థాయ్‌లాండ్) అక్షరాలతో మొదలయ్యే దేశాల్లో ఈ భూకంపం సంభవిస్తుందని వివరించారు. రిక్టర్ స్కేల్‌పై 6కు పైగా తీవ్రతతో భూకంపం సంభవిస్తుందంటూ గతంలో చెప్పానని, ఇది రుజువైందని అన్నారు.

Take a Poll

తనను, తన జ్యోతిష్యాన్ని విమర్శించే వాళ్లు ఇప్పుడు ఏమంటారో చూద్దామని వేణు స్వామి వ్యాఖ్యానించారు. ఈ రెండు దేశాల్లో భూకంపాలు రాబోతోన్నాయనే విషయాల గురించి ముందే చెప్పింది తానొక్కడినేనని గుర్తు చేశారు. జ్యోతిష్య శాస్త్రంలో మంచి, చెడు రెండూ ఉంటాయని, వాటి గురించి చెప్పక తప్పదని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+