హేవలంబి నామ సంవత్సరం: మీన రాశి ఫలాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

మీన రాశివారు (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు)

ఆదాయం - 11 వ్యయం - 5 రాజ్యపూజ్యం -2 అవమానం -4

గురుడు సెప్టెంబర్‌ వరకు కన్యలో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఈ దశ మీ జీవితములో మంచి రోజుల్ని తెస్తుంది. శారీరక సౌఖ్యము, వస్తులాభము, మంచి పదార్గాలు భుజించుదురు, ఆస్థి కొనుగోలు విశ్రాంతిగా ఉండుట మరియు పై అధికారుల వలన గౌరవము పొందుట వంటివి సంభవము. సంఘములో కూడా మీకు ఉన్నతమైన కాలము, సజ్జనులతో సహవాసము, తద్వారా లబ్ది పొందుదురు. మీ వాక్కు చాతుర్యముతో మరియు చలాకీగా వ్యవహరించుట వలన అందరిని ఆకటుకొందురు. ఈ సమయములో పుణ్యక్షేత్ర సందర్శనము కలుగును. ఆరోగ్యము బాగుగా ఉంటుంది. మీ మంచి తనమును అందరు గుర్తిస్తారు. గృహములో సంతోషమైన, విలాసవంతమైన జీవితము గడుపుతారు. పెళ్లికాని వారికి వివాహ యోగము, వివాహితులకు సంతాన యోగము ఉన్నవి. కొత్తగా పెళ్లయిన వారికి వారి దాంపత్య జీవితము సాఫీగా సాగుతుంది.

11 సెప్టెంబర్‌ నుండి గురుడి తులలో సంచరించుట వలన. ఈ దశ మీకు అసంతృప్తిని తెస్తుంది. ఆరోగ్య భంగము మరియు పలు రోగాల వలన శారీరక హాని మరియు నిరుత్సాహముతో ఉటారు. కార్య సాధనకు కష్టించి పని చేయవలసి వస్తుంది. అనవసరమైన వాదనలకు దిగక, చేయు పనియందు దృష్టి పెట్టాలి. ఉద్యోగ విషయాలలో జాగ్రత్త అవసరము, లేనిచో భంగపాటు తప్పవు. ప్రభుత్వ విషయాలలో చిక్కుల్లో చిక్కుకొని, అవసరమైతే జైలు పాలు అవుతారు. అనవసరపు ఖర్చులు చేయరాదు. దొంగతనము జరగకుండా జాగ్రత్తలు అవసరము. ప్రయాణము చేయవలసి వస్తే దాన్ని వాయిదా వేయుట మంచిది. ప్రయాణములో ఇబ్బందులు మరియు అనుకున్న ఫలితములు దక్కవు. ఇంట్లో వారితోను, స్నేహితులతోను తగవులు పనికిరావు. ఇవి మిమ్మల్ని శత్రుత్వము పెంచేలా దోహదపడుతుంది. మీరు ఉగ్ర రూపులుగా తయారు అవుతారు. దురుసుగా వ్యవహరిస్తారు. దయలేకుండా ప్రవర్తిస్తారు. కావున, శాంతముగా ఉండుట మంచిది.

The Raasi Phalas of Hevalambi meenarasi

శని 07 ఏప్రిల్‌ నుండి ధనులో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఆరోగ్య నష్టము, మనశ్శాంతి ఉండదు. ఇంటా, బయటా చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చును. వర్తకులు ధన నష్టము చవిచూసెదరు. వ్యవసాయదారు ప్రత్యేక శద్ద వహించాలి. కొందరికి కొత్త వృత్తి లభించును. కాని ఇబ్బందులు పడుదురు. పై అధికారులలో భేదాభిప్రాయాలు సంభవించును. శత్రువులు, దొంగ దెబ్బ తీయుటకు అవకాశము ఉండవచ్చును. ఆదాయమును మించిన ఖర్చు చేస్తారు. దీని వలన పేదరికమునకు గురి కాగలరు.

శని21 జూన్‌ వృశ్చిక సంచారం వలన, ఈ దశ మిమ్మల్ని నిరుత్సాహ పరచును. వృత్తి వ్యవహారములలో కష్టకాలము, ఉద్యోగములో వేరే చోటికి బదిలీలు జరిగి, ఎక్కువ కష్టించవలసి వచ్చును. ఇతర ఉద్యోగులతోను, శత్రువులతోను జాగ్రత్తగా మసలు కోవలెను. మంచి పేరు తెచ్చుకొనుటకు బాగా కష్టించి కృషి చేయాలి. ధనవిషయాలలో జాగ్రత్త అవసరము. అనవసర ఖర్చులు చేయుదురు. ఎక్కువ సంపాదనకు కష్టించి పని చేయవలెను. ఇబ్బందులు ఎదుర్కొందురు. చెడ్డ పనులకు దూరముగా ఉండాలి. బుద్ధి భ్రంశము కలుగవచ్చును. ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. మనశ్శాంతి ఉండదు. భార్య, పిల్లల ప్రవర్తన చింతను పెంచును. మీ పుత్రుని ఆరోగ్యము క్షీణించును. దగ్గర బంధువులకు మరణము సంభవించును.

శనిఅక్టోబర్‌ 25నుండి ధనూరాశి సంచారం వలన. ఋణాలు తీసుకొనుట మంచిది కాదు. ఆరోగ్యముపై శ్రద్ధ తప్పని సరి. మోకాళ్ల నొప్పులు, గుండె నొప్పి సంభవించును. తల్లిదండ్రుల ఆరోగ్యము క్షీణించును. వైవాహిక జీవితములో ఒడుదుడుకులు, భేధాభిప్రాయాలు, ప్రయాణాలు సంభవించును. చెడు వ్యసనాలు చేయరాదు. సంఘములో పేరు నిలుపుకొనుటకు ప్రయిత్నించాలి.

ఆగస్ట్‌ 18 వరకు రాహువు సింహరాశి సంచారం వలన, మీ అత్త మామలనుండి ధనాదాయము ఆశించవచ్చును. అంటు రోగాలు రాకుండా జాగ్రత్త పడవలెను. సరైన సమయానికి ఔషద సేవ చేత చక్కగా ఉందురు. సంఘములో మంచి కీర్తిని గడిస్తారు. అన్యస్త్రీతో పరిచయాలు, ఇది మీకు ఆనందాన్ని కలిగించవచ్చును. శత్రునాశనము కలుగవచ్చును. కేతువు ద్వాదశమునందు ప్రవేశము:- ఈ దశలో ఆరోగ్యముపై ప్రత్యేక శ్రద్ధ అవసరము, లేనిచో ఆరోగ్య ఇబ్బందులు, మొలల రోగముతో బాధపడుదురు. జీవిత భాగస్వామి అనారోగ్యము మిమ్మల్ని కలవర పెడుతుంది. మీ ఇద్దరి అనారోగ్యము మీ వైవాహిక జీవితముపై ప్రభావము చూపిస్తుంది. మీలో కొంతమందికి మతి మరుపు వస్తుంది. చేస్తున్న పనిపై శ్రద్ధ అవసరము, లేనిచో పనిలో ఇబ్బందులు ఎదురుకాగలవు. ఖర్చులను తగ్గించుకోవలెను.

ఆగస్ట్‌ 18 నుండి రాహువు కర్కాటకరాశి సంచారం వలన, ఆరోగ్య విషయములో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య భంగము, వారికి అనుకోని రోగములు వచ్చి చాలా ఇబ్బందులకు గురి కావచ్చును. మనశ్శాంతి నశించును. తొందరపాటు తనము వలన తప్పుడు నిర్ణయాలు తీసుకొందురు. కాని, కొందరికి అనుకోని విధముగా చేసే పనులలో, వ్యవహారములలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ధన లాభము కలుగవచ్చును.

కేతువు ఏకాదశమునందు ప్రవేశము:- చంద్రుని ఆకారము పెద్దదిగా అగుచుండటము వలన మీలో కొంతమందికి పుణ్యకార్యములు చేయుటకు గురువు లభిస్తారు. దీని వలన మీరు ఎంతో ధైర్యముతో పుణ్య మార్గములో/భక్తి మార్గములో నడుచుకొందురు. ఈ దశ మీకు మంచిని, తెస్తుంది. అలాగే ఇష్టమైన పదార్ధములు భుజింతుదురు. అయితే కేతు ప్రభావము వలన మీలో నిరుత్సాహము పెరిగి, మీ మనస్సుకు చింత కలుగును. ఈ దశలో మీకు వ్యవసాయము పట్ల మక్కువ పెరుగును. గృహమునందు సొంతవారితోనే శత్రుత్వము పెరుగును. వృత్తి వ్యవహారములలో నష్టము వాటిలును.

మేష రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Raasi Phalas of Hevalambi raasi Phalas have been given by the astrolger.
Please Wait while comments are loading...