యూపి అల్లర్లు: కేంద్రం, యుపి ప్రభుత్వానికి నోటీసులు
న్యూఢిల్లీ/లక్నో/శ్రీనగర్: ముజఫర్ నగర్ అల్లర్లపై వివరణ ఇవ్వాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ రెండు గంటలలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ముజఫర్ నగర్‌లో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శాంతిని నెలకొల్పేందుకు అఖిలేష్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పెదవి విరిచింది. ముజఫర్ నగర్ అల్లర్ల పైన సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.

ములాయంపై అజిత్ కామెంట్
ముజఫర్ నగర్ అల్లర్ల నేపథ్యంలో ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పైన మండిపడ్డారు. ములాయం ఉత్తర ప్రదేశ్ మోడీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అజిత్ సింగ్ పరిస్థితిని తెలుసుకునేందుకు బాగ్‌పేట వెళ్తుండగా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అల్లర్లను కంట్రోల్ చేయడంలో ఎస్పీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్నారు. ములాయం యుపి మోడి అవుదామనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు ముజఫర్ నగర్ అల్లర్లను గోద్రా అల్లర్లతో పోల్చడాన్ని ములాయం సింగ్ యాదవ్ ఖండించారు.












Click it and Unblock the Notifications