15న డిఎస్సీ నోటిఫికేషన్
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో టీచర్ల ఎంపికకుసంబంధించి ఆగస్టు 26న ప్రభుత్వం డిఎస్‌సి-2001 రాతపరీక్షలను నిర్వహిస్తుంది. ఈ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 15న జారీ చేస్తారు. ఈ విషయం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. జూన్15 నుంచి జులై 27వ తేదీవరకు దరఖాస్తునకు గడువు వుంటుందని ఆయన చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్ష ద్వారా 32 వేల పై చిలుకు ఖాళీలను భర్తీ చేయనున్నట్టుగా ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 20వ తేదీకల్లా ఫలితాలు వెల్లడిస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు సెప్టెంబర్ 25 నుంచి 30వ తేదీవరకు కౌన్సెలింగ్ నిర్వహించి ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తారు. ఈ సారి డిఎస్‌సి ద్వారా 1130 పిఇటి టీచర్ల పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. అప్‌గ్రేడ్ అయిన ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక పిఇటిని ఇవ్వాలన్నది తమ అభిమతమని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications
