వీరప్పన్ కు ఉచ్చు బిగించిన జయ
చెన్నైః అడవి దొంగ వీరప్పన్ ను పట్టుకునేందుకు తమిళనాడు మాజీ డిజిపి పట్టువదలని విక్రమార్కుడిలా మళ్ళీ అడవుల్లోకి వెళ్ళనున్నారు. వీరప్పన్ పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన స్పెషల్ టాస్క్ ఫోర్సుకి దేవారం నాయకత్వం వహించనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు.
గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ఆమె సమాధానమిస్తూ దేవారం నియామకాన్ని ప్రకటించారు. దేవారం డిజిపిగా ఉండగా వీరప్పన్ ను పట్టుకోడానికి సీరియస్ ప్రయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. ఐజి విజయకుమార్ దేవారం కు డిప్యూటీగా వ్యవహరిస్తారని అమె తెలిపారు.
వీరపన్ ను పట్టుకోడానికి తమ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహం రూపొందించిందని ఆమె తెలిపారు. వీరప్పన్ ను బందీగా సజీవంగా పట్టుకోవడమో లేదంటే అతను స్వయంగా లొంగిపోవడమో ఏదో ఒకటి జరుగుతుందని ఆమె అన్నారు. గతంలో జయలలిత అధికారంలో ఉన్నప్పుడు దేవారం స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధిపతిగా పని చేశారు. దేవారం ఆమెకు నమ్మకస్తుడైన పోలీసు అధికారి. ఐజి విజయకుమార్ కూడా గతంలో ఆమె సెక్యూరిటీ ఇన్ చార్జిగా పని చేశారు.












Click it and Unblock the Notifications
