టిసిఎల్‌ఎఫ్‌కు ప్రణబ్‌బ్రేక్!
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై చిన్న రాష్ట్రాలఏర్పాటుపై అధ్యయనానికి ఎఐసిసి నియమించిన సబ్ కమిటీచైర్మన్ ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రకటన తెలంగాణాకాంగ్రెస్ లెజిస్లేచర్ ఫోరమ్ (టిసిఎల్‌ఎఫ్)ను ఇరకాటంలో పెట్టింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పైకాంగ్రెస్ అధిష్ఠానం పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల లోపునిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుడిమాండ్‌కు పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధంలేదని ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలుఐదేళ్లకు సంబంధించినవని, అందుకు భిన్నంగా రాష్ట్రం ఏర్పాటుఅన్నది ఒకసారి మాత్రమే జరుగుతుందని ఆయనఅన్నారు. తెలంగాణా విషయంలో పార్టీకి చెందిన ఆ ప్రాంత శాసనసభ్యులు వినతిపత్రాలుఇచ్చారే తప్ప ఏ విధమైన అల్టిమేటమ్ ఇవ్వలేదనిఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలనుదృష్టిలో పెట్టుకుని పార్టీ శాసనసభ్యులు తెస్తున్న ఒత్తిడిని ప్రస్తావిస్తూపంచాయతీ ఎన్నికలు ఒక తెలంగాణాకే పరిమితంకాలేదని, ఆంధ్రప్రాంతంలోనూజరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై వివిధనాయకులతోనూ, శాసనసభ్యులతోనూ చర్చిస్తున్నామని, తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌తాజా పరిస్థితిపై తమకు పూర్తి అవగాహనఉన్నదని ఆయన అన్నారు. తెలంగాణా డిమాండ్‌తో పాటువిదర్భ, సౌరాష్ట్ర, హరిత్ ప్రదేశ్ తదితర ప్రాంతాలనుంచి వస్తున్న ఇదే డిమాండ్లను కూడాపరిశీలించాల్సి వుంటుందని ఆయన అన్నారు. వీటిన్నంటిని పరిగణనలోకి తీసుకునినిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications