జావాకు సి షార్ప్ సవాల్
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ త్వరలో మార్కెట్‌లోకి తేనున్న కొత్త ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ సి షార్ప్ ప్రస్తుతం విరివిగా వాడుకలో వున్న సన్‌మైక్రోసిస్టమ్స్ లాంగ్వేజ్ జావాకు గట్టిపోటీనిచ్చే అవకాశం వున్నదని అంటున్నారు. సి షార్ప్ బీటా 2 వెర్షన్ ఇప్పటికే బయటకువచ్చింది.
తుది వెర్షన్ మెరుగులు దిద్దుకుని మార్కెట్‌లోకి రావడానికి ఎంతోకాలం పట్టకపోవచ్చు. అయితే పోటీ ఎంత తీవ్రంగా వున్న జావాను పూర్తిగా రీప్లేస్ చేయడం సి షార్ప్ తరం కాకపోవచ్చని ఐటి నిపుణులు అంటున్నారు. హైదరాబాద్‌తో సహా దేశంలోని వివిధ ఐటి శిక్షణా సంస్థలు అప్పుడే ఈ సి షార్ప్‌లో శిక్షణా కార్యక్రమం కోసం సన్నాహాలు చేస్తున్నాయి. గతంలో సి, జావా, విబి, ఒరకిల్ బూమ్ వచ్చినట్టుగానే కొద్ది రోజుల పాటు సిషార్ప్ బూమ్ సాగే అవకాశం వున్నదని మార్కెట్ వర్గాల అంచనా.












Click it and Unblock the Notifications