ఓటీటీలోకి క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్.. త‌ల లేని డెడ్‌ బాడీ .. ట్విస్టులమీద ట్విస్టులు..!

వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ నరేష్ అగస్త్య. అయితే ఆయన ప్రధాన పాత్రలో తెలుగులో ఓ క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్ వెబ్‌ సిరీస్ తెర‌కెక్కుతోంది. 'రుద్ర‌వ‌నం పీఎస్' పేరుతో రూపొందుతున్న ఈ వెబ్‌ సిరీస్ అక్టోబ‌ర్ 30 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ఓ మారుమూల గ్రామం.. ఆ గ్రామంలో లభ్యమైన మొండెం లేని డెడ్ బాడీ.. ఆ వెంటనే మరో వ్యక్తి అదృశ్యం.. ఈ వరుస సంఘటనల వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటి..? ఈ మిస్టరీని ఛేదించేందుకు ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగితే ఏం జరుగుతుంది..? ఇలాంటి ఉత్కంఠభరితమైన ప్రశ్నలతో ప్రేక్షకుల్ని సరికొత్త మిస్టరీ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు రుద్రవనం పీఎస్ అనే సరికొత్త మినీ సిరీస్ సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ మిస్టరీ వెబ్ సిరీస్ కు రైటర్ గా తాజ్ సయ్యద్ పనిచేశారు. ఆయన గతంలో ఆర్ ఎక్స్ 100, జాంబీరెడ్డి, మంగళవారం తదితర సినిమాలకు పనిచేశారు. మరోవైపు ఏడు ఎపిసోడ్స్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నరేష్ అగస్త్య నటన అందరినీ ఆకట్టుకోనున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఓ సాధారణ మర్డర్ మిస్టరీగా స్టార్ట్ అయ్యే ఈ వెబ్ సిరీస్ అలా వెళ్తున్న కొద్దీ ఊహించని మలుపులతో ప్రేక్షకులకు ఆసక్తిని పెంచుతుంది. ఈ క్రమంలోనే ఆ ఊరికి సంబంధించిన కొన్ని భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటాయి. అలాగే ఇటీవల రిలీజ్ చేసిన వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్ వెబ్ సిరీస్ పై అంచనాలను పెంచేసింది.

RudravanamPS crime thriller web series arrives on OTT featuring the mystery of a headless dead body

ఇక రుద్ర‌వ‌నం పీఎస్ వెబ్‌ సిరీస్‌ కు శ‌శిధ‌ర్ మున్నంగి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ వెబ్‌ సిరీస్‌ లో బెనర్జీ, శివ అలపాటి, సుగాలి సిలోని, శ్రావణి రెడ్డి తదితరులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. అలాగే ఈ సిరీస్‌ కు అష్కర్ అలీ సినిమాటోగ్రఫీ అందించారు. రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ అక్టోబర్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ జీ5 లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+