షర్మిల కూతురి పెళ్లికి జగన్ ఇల్లు అందుకే ఇవ్వలేదా ? కీలక కారణాలు..!

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (YS Jagan) ఏపీలోని తాడేపల్లితో పాటు హైదరాబాద్ లోటస్ పాండ్, బెంగళూరు యలహంకలోనూ నివాసాలు ఉన్నాయి. అయితే ఇందులో బెంగళూరు యలహంకలో ఉన్న నివాసాన్ని తన సోదరి వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజిలీ రెడ్డి పెళ్లి కోసం ఇవ్వాలంటూ అడిగారని, అయితే తనతో ఉన్న విభేదాల నేపథ్యంలో దాన్ని తిరస్కరించారంటూ ఓ వర్గం మీడియా తీవ్రంగా ప్రచారం చేస్తోంది. దీని వెనుక ఉన్న వాస్తవమెంతో ఓసారి చూద్దాం..

వైసీపీ నేతలకు ఎస్ఈసీ ఝలక్- సుప్రీం తీర్పు, ఎన్నికల బ్రేక్ తర్వాత మరో ట్విస్ట్..!
వైసీపీ నేతలకు ఎస్ఈసీ ఝలక్- సుప్రీం తీర్పు, ఎన్నికల బ్రేక్ తర్వాత మరో ట్విస్ట్..!

వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి వచ్చే నెలలో జరగాల్సి ఉంది. ఈ పెళ్లి వేదికగా వైఎస్ జగన్ కు చెందిన యలహంక నివాసాన్ని పెళ్లి పత్రికల్లో కూడా ప్రచురించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జగన్ తన నివాసాన్ని మేనకోడలు పెళ్లికి ఇచ్చేందుకు నిరాకరించారని, దీనిపై వైఎస్ షర్మిల తో పాటు తల్లి విజయమ్మ కూడా ఆవేదన చెందుతున్నారేది ఈ కథనాల సారాంశం. అయితే వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ వర్గాల సమాచారం మేరకు ఈ వివాదం వెనుక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Why YS Jagan Rejected Using His Yelahanka House for Niece YS Anjili Reddy s Wedding

బెంగళూరులోని యలహంక నివాసంలో తన మేనకోడలైన అంజిలీ రెడ్డి పెళ్లికి వేదికగా నిర్ణయించక ముందే వైఎస్ జగన్ తన సోదరి షర్మిల కు లేఖ రాసినట్లు సమాచారం. ఇందులో భద్రతా కారణాల రీత్యా తన నివాసం ఇవ్వలేనని చెప్పినట్లు తెలుస్తోంది. అయినా షర్మిల వినకుండా మొండిగా తన కూతురు పెళ్లి వేదికగా ఖరారు చేసుకుని, ఈ మేరకు ఆహ్వాన పత్రికలు ఇవ్వడం మొదలుపెట్టినట్లు వైఎస్సార్సీపీ వర్గాల సమాచారం. తమ మధ్య ఎన్ని వివాదాలు ఉన్నా అంజిలీ రెడ్డి సంతోషంగా పెళ్లి చేసుకోవాలని, జీవితాంతం సంతోషంగా ఉండాలని జగన్ ఈ లేఖలో చెప్పినట్లు సమాచారం. అలాగే తన అభ్యంతరాలను పట్టించుకోకుండా యలహంక నివాసంలో అంజిలి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు జగన్ ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే పలువురి దృష్టి ఉన్న ఈ నివాసంలో పెళ్లి నిర్వహిస్తే తనకు భవిష్యత్తులో భద్రతా సమస్యలు తప్పవని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.

Why YS Jagan Rejected Using His Yelahanka House for Niece YS Anjili Reddy s Wedding
విజయసాయిరెడ్డి ఇంటికి వైఎస్ షర్మిల..! ఆప్యాయంగా ఆహ్వానం..!
విజయసాయిరెడ్డి ఇంటికి వైఎస్ షర్మిల..! ఆప్యాయంగా ఆహ్వానం..!

ముఖ్యంగా పెళ్లి వంటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని, క్యాటరింగ్ సిబ్బంది, పూల అలంకరణ బృందాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, అతిథులు సహా ఎంతోమంది వస్తారని, వీరిలో చాలామంది మనకు కనీస పరిచయం కూడా లేని వ్యక్తులేనని, ఇంతమంది వ్యక్తులు నివాస ప్రాంగణంలోకి రాకపోకలు సాగించడం భద్రతాపరమైన ముప్పులకు దారితీస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. అయినా ఈ నిర్ణయం తీసుకోవడం తనకు అంత సులువు కాదన్నారు. తన పిల్లల పెళ్లి విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకునే వాడినని కూడా చెప్పారు. కాబట్టి రాజారెడ్డి పెళ్లికి చేసినట్లుగా కన్వెన్షన్ సెంటర్‌లో గానీ, డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలో గానీ చేసుకోవాలని సూచించారు. అవేవీ సెట్ కాకపోతే దీనికి బదులుగా హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం ఇస్తానని చెప్పినట్లు సమాచారం. అయినా షర్మిల నిరాకరించినట్లు తెలుస్తోంది..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+