సుప్రీం చెప్పినా మార్పు రాలేదు, ఇక నెక్స్ట్ - పార్టీ నేతలకు తేల్చి చెప్పిన జగన్..!!

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న పరిణామాల పైన పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. సుప్రీం తీర్పు తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్న వారే హింసాత్మక ఘటనలకు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ముఖ్య నేతలకు భవిష్యత్ కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేసారు.

మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాల పై వైసీపీ పిటీషన్ పైన విచారణ చేసిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం ఎన్నికలను తాత్కాలికంగా నిలిపి వేసింది. ఈ రోజు వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన 19 మున్సిపాల్టీల్లో నామినేషన్లు.. మున్సిపల్ ఎన్నికల వ్యవహారం పైన స్పష్టత ఇవ్వనుంది. ఈ సమయంలో మాజీ సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిణామాల పైన సమీక్ష చేసారు. జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సమయంలోనూ జరుగుతున్న దాడుల పైన పార్టీ నేత లు వివరించారు. దీంతో జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, హింసపై సుప్రీంకోర్టు తీర్పుపై పార్టీ నేతలతో చర్చించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిందని జగన్ చెప్పుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, హింసను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంద ని వివరించారు. అందుకనే ఎస్‌ఈసీకి ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. చంద్రబాబు వ్యవస్థీకృతంగా ఉద్దేశ పూర్వకంగా హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

వైసీపీలో చేరిన గుండ లక్ష్మీదేవి - పదవి ఖరారు చేసిన జగన్..!!
వైసీపీలో చేరిన గుండ లక్ష్మీదేవి - పదవి ఖరారు చేసిన జగన్..!!
ys-jagan-says-fight-will-continue-despite-supreme-court-orders-key-directions-for-party-leaders

పార్టీ నేతలకు జగన్ కీలక దిశా నిర్దేశం

కాగా, జరిగిన ఘటనలు ఈ అంశాన్ని నిర్థారిస్తున్నాయని జగన్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా పరిస్థితిలో మార్పురాలేదని జగన్ వ్యాఖ్యానించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీల్లోనూ హింసకు పాల్పడుతున్నార ని.. ప్రభుత్వాన్నినడుపుతున్నవారే హింసకు పాల్పడ్డం ఎక్కడా చూసి ఉండమని ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులను వాడుకుని ఈ దారుణాలన్నీ చంద్రబాబు చేయిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తదనంతరం తీసుకోవాల్సిన పరిణామాలపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసారు. క్షేత్రస్థాయి లో కార్యకర్తలు, నాయులు తిరుగులేని ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేదిశగా గొప్పగా పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయలో జరుగుతున్న ఘటనలపై ఆధారాలు సేకరణ చాలా అవసరమని.. పార్టీ నాయకులకు ఆమేరకు సూచనలు సలహాలు ఇవ్వాలని సూచన చేసారు. పటిష్ట ఆధారాలను కోర్టుల ముందు ఉంచడం ద్వారా న్యాయపోరాటం కొనసాగిస్తామని.. ప్రజాస్వామ్య పరిరక్షణ మన బాధ్యతగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ఎందాకైనా పోరాటం కొనసాగుతుందని జగన్ స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+