శ్రీలంక నేత చంద్రిక అదృశ్యం
కొలంబో: శ్రీలంక అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగ రహస్యంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆమె ఏ దేశం వెళ్లిందీ, ఎప్పుడు తిరిగివచ్చేది అధికారులు చెప్పలేకపోతున్నారు. చంద్రిక ఆకస్మికంగా అదృశ్యం కావడంతో పాటు తాత్కాలిక అధ్యక్షునిగా ప్రధాని విక్రమనాయకే ప్రమాణస్వీకారం చేయడంతో రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
అధ్యక్షుడు అనారోగ్యంతో వున్నప్పుడు, అందుబాటులో లేనపుడు ప్రధానిని తాత్కాలికంగా అధ్యక్షపీఠంపై కూర్చోబెట్టే వెసులుబాటు శ్రీలంక రాజ్యాంగంలో వుంది. అయితే దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొని వున్న ఈ దశలో చంద్రిక ఆకస్మిక రహస్య పర్యటన అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది. విక్రమనాయకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో ఓటింగ్ జరిగే సమయానికైనా ఆమె వెనుతిరిగి వస్తారా అన్నది అనుమానమే నని అంటున్నారు.












Click it and Unblock the Notifications