నితీష్ భాయ్.. అది ఫ్రీ హిట్ రా బాబు!(వీడియో)
Viral Video: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ క్రికెట్ అభిమానులకు వినోదాన్ని అందించడమే కాకుండా సోషల్ మీడియాలో నెటిజన్ల ముఖాల్లో నవ్వులు పూయిస్తోంది. భారత ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టినప్పటికీ.. ఆ తర్వాత జరిగిన పరిణామం వైరల్‌గా మారింది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ ఓవర్ నాలుగో బంతికి కివీస్ బ్యాటర్ బెవాన్ జాకబ్స్ పెద్ద షాట్ ఆడేందుకు ప్రయత్నించి బంతిని గాల్లోకి లేపాడు. లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నితీష్ కుమార్ రెడ్డి ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని క్యాచ్‌గా మలుచుకున్నాడు.

క్యాచ్ పూర్తి కాగానే నితీష్ కుమార్ రెడ్డి వికెట్ పడిపోయిందనే సంతోషంతో గాల్లోకి చేతులు ఎత్తుతూ సంబరాలు చేసుకోవడం ప్రారంభించాడు. అయితే అది భువనేశ్వర్ కుమార్ వేసిన నో-బాల్ కారణంగా లభించిన 'ఫ్రీ-హిట్'బంతి అని నితీష్ కుమార్ రెడ్డికి మరుక్షణమే గుర్తుకొచ్చింది. ఫ్రీ-హిట్ బంతికి బ్యాటర్‌ను క్యాచ్ అవుట్ చేసే అవకాశం ఉండకపోవడంతో బ్యాటర్ రనౌట్ మినహా అవుట్ కాలేడని తెలిసిందే.
తన పొరపాటును వెంటనే గ్రహించిన నితీష్ కుమార్ రెడ్డి ముఖంలో నవ్వులు చిందిస్తూ.. సారీ అంటూ నవ్వుతూ చేతులు పైకెత్తాడు. మరోవైపు బెవాన్ జాకబ్స్ లైఫ్‌లైన్ పొందటంతో బ్యాటింగ్ కొనసాగించాడు. నితీష్ కుమార్ రెడ్డి క్షమాపణలు కోరిన ఈ సరదా ఘట్టానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Bhuvneshwar Kumar 3rd over and getting hit hardEmbarassment movement for the Nitish Kumar Reddy https://t.co/Fha6ZqKlj1
— BackToLobby (@_backtolobby) October 22, 2026














Click it and Unblock the Notifications
