షాపింగ్ కేంద్రంగా హైదరాబాద్
హైదరాబాద్: హైదరాబాద్‌ను అంతర్జాతీయ షాపింగ్ కేంద్రంగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో వున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం పలు విధాన పరమైన నిర్ణయాలను తీసుకోనున్నట్టుగా ఆయన చెప్పారు. ఐటి తర్వాత తమ ప్రభుత్వం టూరిజం అభివృద్ధిపై దృష్టి నిలిపిందని ఆయన చెప్పారు.
హైదరాబాద్‌ను భారీ షాపింగ్ కేంద్రంగా తీర్చిదిద్దడానికి వీలుగా దుబాయి ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని కూడా ప్రభుత్వం కుదుర్చుకున్నది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం ఒగ్లివీ లైవ్ చేపట్టిన :ది రాయల్ షాపింగ్ అడ్వెంచర్‌ను ముఖ్యమంత్రి గురువారం నాడు ప్రారంభించారు. పెద్దఎత్తున షాపింగ్ మాల్స్ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రొత్సహిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. పారిశ్రామిక వస్తువులు, కళాఉత్పత్తులు, సాంస్కృతిక అంశాలు, ఆహారపదార్ధాలకు సంబంధించి హైదరాబాద్ అతిపెద్ద షాపింగ్ సెంటర్ కావలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా త్వరలోనే ప్రారంభం కాగలదని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications