స్వల్పంగా తగ్గిన సాఫ్ట్‌వేర్ ఎగుమతులు
న్యూఢిల్లీః ఈ ఆర్ధిక సంవత్సరం తొలి మూడునెలల కాలంలో సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 8600 కోట్ల రూపాయలతో 52 శాతం మేర అభివృద్ధిని సాధించాయి. అంతకుముందు సంవత్సరం ఇదే మూడు నెలల కాలంలోని సాధించిన 65 శాతం అభివృద్ధితో పోలిస్తే ఇది తక్కువగానే వున్నప్పటికీ మరీ నిరాశజనకంగా మాత్రం లేదని నాస్కామ్ చైర్మన్ ఫిరోజ్ వంద్రేవాలా చెప్పారు.
ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్ ఎగుమతుల రాబడి కనీసం 9400 కోట్ల రూపాయలు వుండే అవకాశం వున్నదని ఆయన అన్నారు. నాస్కామ్ కొత్త చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన కిరణ్‌కార్నిక్ మాట్లాడుతూ, భారతీయ ఐటి రంగం రాణించడానికి ద్విముఖ వ్యూహాన్ని ప్రతిపాదించారు. దేశీయ ఐటి మార్కెట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు గ్లోబల్ బ్రాండ్‌గా భారత్‌ను అంతర్జాతీయమార్కెట్‌లో ప్రమోట్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
దేశీయ మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వంతో కలసి పనిచేయాల్సిన అవసరం వున్నదని ఆయన చెప్పారు. ఇదిలా వుండగా నాస్కామ్ వైస్ చైర్మన్‌గా డిజిటల్ ఎండి సోమ్‌మిట్టల్‌ను నియమించారు. అసోసియేషన్ వెస్ ప్రెసిడెంట్‌గా సంగీతాగుప్తాను నియమించారు.












Click it and Unblock the Notifications
