చైర్మన్ అరెస్టుకు ఇంటర్‌పోల్ సాయం
హైదరాబాద్‌ః కృషిబ్యాంక్ చైర్మన్ కె వెంకటేశ్వరరావును సంప్రదించడానికి గత నాలుగు రోజులుగా విఫలప్రయత్నం చేసిన నగరపోలీసు విభాగం ఆయన అరెస్టుకు ఇంటర్‌పోల్ సాయం తీసుకోవాలని నిర్ణయించింది. అమెరికాలో వున్నట్టుగా చెబుతున్న వెంకటేశ్వరరావు ఈ నెల 20న హైదరాబాద్ తిరిగివస్తున్నట్టుగా సమాచారం అందినప్పటికీ పోలీసులు ఆయనతో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
చెర్మన్ మాత్రమే కాకుండా ఆయన సన్నిహిత బంధువులైన డైరెక్టర్లు కూడా జాడలేకుండా మాయం కావడంతో ఒకటి రెండు రోజుల్లో చైర్మన్ వెంకటేశ్వరరావు, పదిమంది డైరెక్టర్ల ఫొటోలతో సహా పత్రికల్లో పోలీసులు వారికోసం గాలిస్తున్నట్టుగా ప్రకటనలు జారీ చేయాలని నిర్ణయించారు. కృషి బ్యాంకు కేసునుసీరియస్‌గా తీసుకున్న కమిషనర్ పేర్వారం రాములు డైరెక్టర్లు, చైర్మన్ స్థిర చరాస్తుల జప్తునకు ఆదేశించారు.వీటిని అమ్మి డిపాజిటర్లకు రావల్సిన మొత్తాలను దమాషా పద్దతిన పంచడం జరుగుతుందనిఆయన చెప్పారు.
కేసుపెట్టిన ఆర్‌బిఐ
- ఎవరీ కొసరాజు వెంకటేశ్వరరావు?
- కృషిబాంకుకు లిక్విడేషనే మార్గం
- సంక్షోభంలో కృషి బ్యాంక్
- దొరకనికృషి బ్యాంక్ చైర్మన్, డైరెక్టర్లు
- ఆర్‌బిఐదే అసలు పాపం.....












Click it and Unblock the Notifications
