కేసుపెట్టిన ఆర్‌బిఐ
హైదరాబాద్‌ః డిపాజిటర్లను ముంచిన కృషి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ పదిమంది డైరెక్టర్లకు వ్యతిరేకంగా ఆర్‌బిఐ స్థానిక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసింది. రుణాల మంజూరు, ఓవర్ డ్రాఫ్ట్‌ల విషయంలో అన్ని రకాల నియమనిబంధనలకు బాంకు నీళ్లొదిలిందని ఆర్‌బిఐ పేర్కొంది.
గరిష్ట 30 రోజుల వ్యవధికి 5 వేల రూపాయలు మాత్రమే ఓవర్‌డ్రాఫ్ట్ ఇవ్వాలని నిబంధనలు వుండగా కృషిబాంకు ఏడాది కాలానికి 90 లక్షల రూపాయల మేర ఓవర్ డ్రాఫ్ట్ జారీ చేసిందని ఆర్‌బిఐపేర్కొంది. చైర్మన్ ఆయన సొంత సంస్థలు అన్ని రకాల నిబంధనలువిరుద్దంగా భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నవిషయం కూడా ఆర్‌బిఐ తన ఫిర్యాదులో పేర్కొంది. చైర్మన్ వెంకటేశ్వరరావు 38.5 లక్షల రూపాయల రుణం తీసుకోగా ఆయన సొంత సంస్థలు హల్‌సైన్ సాఫ్ట్‌టెక్ 55.17 లక్షల రూపాయలు, గోల్డ్‌క్రెస్ట్ పవర్ 390 లక్షల రూపాయలు కృషినుంచి రుణంగా తీసుకున్నాయి.
ఈ రుణాల మంజూరులో ఎలాంటి పద్దతులను పాటించలేదు. ఆర్‌బిఐ సూచించిన పరిమితులను పక్కనబెట్టి కొన్ని కంపెనీలకుషేర్లను కుదువబెట్టుకుని ఉదారంగా రుణాలు మంజూరు చేయడానికి కూడా చైర్మన్ సిఫారసు కారణమనిఅంటున్నారు.
చైర్మన్ అరెస్టుకు ఇంటర్‌పోల్ సాయం
- ఎవరీ కొసరాజు వెంకటేశ్వరరావు?
- కృషిబాంకుకు లిక్విడేషనే మార్గం
- సంక్షోభంలో కృషి బ్యాంక్
- దొరకనికృషి బ్యాంక్ చైర్మన్, డైరెక్టర్లు
- ఆర్‌బిఐదే అసలు పాపం.....












Click it and Unblock the Notifications
