గ్రామీణ ఉపాధికి కొత్త పథకం
హైదరాబాద్‌ః రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాథి కల్పనకోసం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల జీవనభృతి పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించింది. 320 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ పథకం ఏడేళ్ల పాటు అమల్లో వుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
శుక్రవారం నాడు రాష్ట్రంలో అమలుచేస్తున్న వాటర్‌షెడ్ పథకాలను ఆయన ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఇప్పటికే పూర్తయిన 5489 వాటర్‌షెడ్ పథకాల స్థితిగతులను అమల్లో వున్న మరో 2690 ప్రాజెక్టుల పరిస్థితిని గురించి సమావేశం సమీక్షించింది. కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులకోసం మరో 100 కోట్ల రూపాయలను కేటాయించాలని సమావేశం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications
