సిఎంల సదస్సుకు బాబు దూరం
న్యూఢిల్లీః విద్య కాషాయీకరణపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఏర్పాటుచేసిన బిజెపి యోతర ముఖ్యమంత్రుల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గైర్హాజరయ్యారు. చంద్రబాబు గైర్హాజరు పట్ల సమావేశానికి హాజరయినఐదుగురు ముఖ్యమంత్రులు, 12 మంది విద్యాశాఖ మంత్రులు విస్మయం వ్యక్తం చేశారు.
జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఏక పక్ష పోకడలను ఘాటుగావిమర్శించిన చంద్రబాబు ఆ తర్వాత కొద్ది గంటల్లోనేవిద్య వంటి కీలక అంశంపై కేంద్రం వైఖరిని ఖండించేందుకు ఏర్పాటైన సదస్సుకు దూరంగా వుండటం గమనార్హం.విద్య ఉమ్మడి జాబితాలో వున్న కారణంగా ఈ విషయంలో కేంద్రం ఏకపక్ష ధోరణిని తాము సహించమని పలుమార్లు తెలుగుదేశం స్పష్టం చేసింది.
ఈ అభిప్రాయంతోనే బుద్ధదేవ్ కూడా తెలుగుదేశం ఎన్‌డిఎ మిత్రపక్షమైనప్పటికీ చంద్రబాబుకు ఆహ్వానంపంపారు. అయితే తనకు ఆహ్వానం అందలేదనే సాకుతోచంద్రబాబు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.












Click it and Unblock the Notifications
