కులం జాతి వివక్ష కాదు: భారత్
డర్బన్: జాతివివక్షకు వ్యతిరేకంగా డర్బన్‌లో జరుగుతున్న సదస్సు ఎజెండాలో కులంఅంశాన్ని చేర్చాలని దళితులు చేస్తున్న డిమాండ్‌ను భారత ప్రభుత్వం త్రోసిపుచ్చింది. ఇలాంటిఅంశాలు లేవనెత్తడానికి ఇది సరైన వేదిక కాదని స్పష్టం చేసింది.సామాజిక అణచివేతలను ప్రోత్సహించకూడదు; వాటికి బాసటగా నిలువకూడదు అన్నది మా విధానం. అయితే సభ్య దేశాల్లో సామాజిక స్థితి గతులు ఫలానా రీతిలో వుండాలని ఆదేశించేందుకు మేం ఇక్కడికి రాలేదు అని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆదివారంనాడు ఆయన జాతివివక్ష వ్యతిరేక సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు.
భారత దేశంలో కుల వ్యవస్థ గురించి దళిత కార్యకర్తలు, ప్రభుత్వేతర సంస్థలు చేపట్టిన ఆందోళనను ఆయన సదస్సు ప్రారంభానికి ముందు ప్రస్తావిస్తూ- ఈ ప్రచారం గోరంతను కొండంత చేసిదిగా, తప్పుదోవ పట్టించేదిగా వున్నదని అన్నారు. కులవివక్ష అనే సామాజిక రుగ్మతను తాము తరుచూ ఎదుర్కుంటున్నామని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, భారతీ జాతీయ ఎజెండాలో ప్రధానాంశంగా ఇదే వున్నదని ఆయనవివరించారు.
చారిత్రక కారణాల రీత్యా నష్టపోయిన, సామాజిక అణచివేతకుగురైన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం రాజ్యాంగ, చట్ట, పాలనాపరంగా చేపట్టిన చర్యలను ఆయనవివరించారు. కులాన్ని జాతి వివక్షతో పోల్చలేమని నలుగురు భారత దేశ పార్లమెంటు సభ్యులు కూడా అన్నారు.












Click it and Unblock the Notifications
